NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : ఏకగ్రీవాల రికార్డ్ కొడదాం అని ప్లాన్ చేసిన జగన్ కి ఆఖరి నిమిషం లో బాంబు పేల్చిన నిమ్మగడ్డ ? 

YS Jagan : YSRCP playing Dangerous Political Game

Ys Jagan : స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఎప్పుడైతే తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వానికి నిమ్మగడ్డ కి మధ్య నువ్వానేనా అన్న వాతావరణం ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తెర వెనకాల చంద్రబాబు నడిపిస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో చాలావరకు ఏకగ్రీవాలు అయ్యేలా సీఎం జగన్ ప్రతి జిల్లాకు సంబంధించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పడం అందరికీ తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా ఏకగ్రీవ ల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ఈ వాచ్ యాప్ అందుబాటులోకి తెచ్చిన తరుణంలో ప్రభుత్వ పంచాయతీ శాఖ నిఘా యాప్ అనేది తమను సంప్రదించకుండా రూపొందించారని ఆరోపణలు చేశారు.

nimmagadda-twist-to-ys-jagan
nimmagadda-twist-to-ys-jagan

అంతేకాకుండా నిఘా యాప్ పై మాకు ఎలాంటి అనుమానాలు లేవని మరో పక్క కామెంట్లు చేయడం జరిగింది. ఇలా ఉంటే జరగబోయే పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సొంత గ్రామాలకు వచ్చే ఓటు వేయాలని కోరారు. హింసకు తావు లేకుండా నిజాయితీగా అంకితభావంతో పని చేయాలని పేర్కొన్నారు. “ఈ వాచ్ యాప్” పరిధిలోకి వచ్చే ప్రతి సమస్యని..క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. ఎవరైనా ఫిర్యాదులపై ప్రభుత్వ అధికారులు గానీ, కలెక్టర్లు గానీ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు గట్టిగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఏకగ్రీవాలు అనేవి వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయని, ప్రజల నుంచి ఏకగ్రీవల విషయంలో సరైన స్పందన లేదని ఊహించని కామెంట్లు నిమ్మగడ్డ చేశారు. అంతేకాకుండా ఎన్నికలలో పోటీ వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటం గ్యారెంటీ అని, అందువల్లే నామినేషన్లు చాలామంది వేయడం జరిగిందని తెలిపారు. మొత్తంమీద ఏకగ్రీవల విషయంలో.. జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యే లకు టార్గెట్ పెట్టిన జగన్ Ys Jagan కి.. నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు అడ్డు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడ కూడా ఏకగ్రీవాలు అవ్వకుండా నిమ్మగడ్డ అధికారులను అలర్ట్ చేయటంతో.. పాటు యాప్ అందుబాటులోకి తీసుకు రావడంతో.. ప్రజా ప్రతినిధులు కూడా పెద్దగా ధైర్యం చేయలేని పరిస్థితి ప్రస్తుత పంచాయతీ ఎన్నికలలో నెలకొన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju