NewsOrbit
న్యూస్

వీడియో: పాముపై ఎలుక దాడి

అరిజోనా: అది అరిజోనా ఎడారి ప్రాంతం. అక్కడ చిన్నచిన్న పొదలున్నాయి. వాటి దగ్గరలో ఓ కంగారూ ఎలుక కూర్చుని ఉంది. తన ఆహారం కోసం అది చూసుకుంటోంది. అయితే, దాని పక్కనే.. ఒక పెద్ద రాటిల్‌స్నేక్ చుట్టలు చుట్టుకుని నక్కి ఉంది. అది కూడా మంచి ఆకలి మీదే ఉంది. అత్యంత సమీపంలోనే ఎలుక ఉండటంతో ఈ రోజుకు తన కడుపు నిండినట్లేనని  ఆ పాము ఆనందపడింది. ఒక్కసారిగా శరీరాన్ని లేపి, నోరంతా బార్లా తెరిచి ఆ ఎలుకను మింగేద్దామని ప్రయత్నించింది. సాధారణంగా అయితే పాము వేగానికి ఎలుక స్వాహా అయిపోవాల్సిందే. కానీ అది అలాంటి ఇలాంటి ఎలుక కాదు.. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకుని గాల్లోకి లేచింది. తన పదునైన పళ్లతో పాము తల మీద కొరికి, తన వెనక కాళ్లతో దాన్ని తన్నేసి ఒక్క ఉదుటన దూరంగా దూకేసింది. పాము నేలమీద పడిపోయింది, ఎలుక ఎంచక్కా తప్పించుకుని పారిపోయింది. ఇదంతా రెప్పపాటు సమయంలోనే అయిపోయింది.

దీనికి సంబంధించిన ఒక నిమిషం వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉత్తర అమెరికాలో ఇలాంటి ఎలుకలు కనిపిస్తాయని తెలిసినా, నింజా స్టైల్లో అవి గాల్లోకి ఎగిరి మరీ కాళ్లతో దాడి చేస్తాయని మాత్రం శాస్త్రవేత్తలకు కూడా ఇంతవరకు తెలియదు. ఇంతకుముందు కూడా కంగారూ ఎలుకలు పాములకు ఆహారం కాకుండా తప్పించుకున్నప్పుడు శాండియాగో స్టేట్ యూనివర్సిటీలో వీటి తీరుపై పరిశోధన చేస్తున్న గ్రేస్ ఫ్రేమిల్లర్, మిలాచి విట్ ఫోర్డ్ లకు ఏం జరిగిందో తెలిసేది కాదు. పాము ఎలుకలకు మధ్య పోరాటం మొత్తం కేవలం 0.7 సెకండ్లలోనే.. అంటే 700 మిల్లీ సెకండ్లలోనే ముగిసిపోయేది. కొన్నిసార్లు ఎలుకలకు పాముకాటు తగిలినా, అవి చనిపోయేవి కావు. దాంతో ఈసారి వాళ్లు హైస్పీడ్ కెమెరాలను ఉపయోగించారు. స్లోమోషన్ లో తాము రికార్డు చేసిన వీడియోను చూసినప్పుడు ఏం జరిగిందో తెలిసింది. ఒక్కసారిగా ఆ శాస్త్రవేత్తలే విస్తుపోయారు.

కంగారూ ఎలుక ఒక్కసారిగా గాల్లోకి లేచి, పాము తల మీద తన రెండు కాళ్లతో తన్నేసి దూరంగా దూకేయడం మొత్తం స్పష్టంగా వీడియోలో కనిపించింది. పాము గాల్లో తేలుతూ నేలమీద పడిపోవడం కనిపించింది గానీ, ఎలుక మాత్రం పూర్తిగా మాయమైపోయింది. ‘నింజా రాట్’ అనే పేరుతో ఆ వీడియోను శాస్త్రవేత్తలు యూట్యూబ్ లో పెట్టారు. ఎలుకలు ఇంత వేగంగా స్పందిస్తాయని తామూ ఊహించలేదన్నారు. సాధారణంగా పాములు 0.1 సెకండ్లలోనే దాడిచేస్తాయి. కానీ కంగారూ ఎలుకలు వాటికంటే వేగంగా ఉన్నాయి. కనురెప్ప మూసి తెరిచేలోగానే అంతా అయిపోయిందని విట్ ఫోర్డ్ చెప్పారు. ఈ దెబ్బకు నింజా రాట్ అభిమానులు ఒక్కసారిగా పెరిగిపోయారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

Leave a Comment