NewsOrbit
న్యూస్

20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో ఆఖరి ప్రకటన ఇస్తున్న నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీ కి సంబంధించి చివరి విడత వివరాలను ఆదివారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఉపాధి హామీ, వైద్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యం, డీక్రిమినలైజేషన్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యాక్ట్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వనరులపై ప్యాకేజీ వివరాలను తెలియచేశారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో సంక్షోభం తలెత్తింది వాస్తవమేనని, అయితే, సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని అన్నారు. అవసరార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశామని చెప్పుకొచ్చారు. భవన నిర్మాణాల రంగానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమ చేశామని తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులు రూ.3,600 కోట్ల నగదు వెనక్కి తీసుకున్నారని చెప్పారు.

మూడు నెలల పాటు పేదలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు. జన్‌ధన్‌కు సంబంధించి రూ.20 కోట్ల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని మోదీ మొదటి నుంచీ చెబుతున్నారని తెలిపారు.

భూమి, శ్రమ, చట్టాలు ఈ మూడింట్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఆహారధాన్యాలు, పప్పు దినుసులు అందిస్తున్నామని తెలిపారు. గరీబ్‌ కల్యాణ్ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ చేశామని చెప్పారు.

సాంకేతిక పరమైన సంస్కరణలు జరగకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నామనీ, రైళ్లకు అయ్యే ఖర్చులు 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయని నిర్మల సీతారామన్ తెలిపారు.

author avatar
venkat mahesh

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Leave a Comment