ట్రెండింగ్ న్యూస్

NISCHAY Wedding : మెహందీ సెలబ్రేషన్స్ అఫిషియల్ వీడియో వచ్చేసింది

NISCHAY Wedding Celebration Day 4 Mehandi
Share

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ.. పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వాళ్ల పెళ్లి అయిపోయినా కూడా ఇంకా సోషల్ మీడియాలో వాళ్ల పెళ్లి గురించే చర్చ. నిహారిక పెళ్లికి ఎవరు వెళ్లారు? ఎవరు వెళ్లలేదు? ఎలా జరిగింది? పెళ్లికి ఎంత ఖర్చయింది.. ఫోటోలు, వీడియోలు.. ఇలా నిహారిక పెళ్లి గురించి మాత్రం మామూలుగా చర్చ జరగడం లేదు.

NISCHAY Wedding Celebration Day 4 Mehandi
NISCHAY Wedding Celebration Day 4 Mehandi

నిహారిక పెళ్లిని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో నిర్వహించారు. తన పెళ్లి సెలబ్రేషన్స్ లో భాగంగా.. మెహందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తాజాగా నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశారు.

నిహారిక మెహందీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, ఇంకా మిగితా మెగా ఫ్యామిలీ సభ్యులంతా మెహందీ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

మెగాస్టార్ పాటలకు అందరూ డ్యాన్స్ వేసి అదరగొట్టారు. మెగాస్టార్ కూడా కొన్ని స్టెప్పులు వేశారు. ఇక.. పవన్ కళ్యాణ్ తో కలిసి అందరూ ఫోటోలు దిగారు. సంగీత్ కు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు కానీ.. మెహందీకి మాత్రం హాజరయ్యారు. ఇంకెందుకు ఆలస్యం.. నిహారిక మెహందీ సెలబ్రేషన్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

తెలుగు భాషాభిమానులను కుషీ చేసిన పీఎం నరేంద్ర మోడీ

somaraju sharma

Ramoji Rao: ఈ వయసులో రామోజీ మైండ్ కి ఏమైంది..? ఇలా దిగజారి ఏం సాధిస్తారు..!?

Srinivas Manem

ఏపీ ఉలిక్కి ప‌డే ఘ‌ట‌న‌లో ఏం జ‌ర‌గ‌నుంది?

sridhar