NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నిసాన్ కార్లు – సియట్ టైర్లు అదిరిపోయే ఒప్పందం.., ఆధునిక టైర్లుతో కార్లు..!!

 

 

ఏ వాహనానికైనా చక్రాలు అత్యంత ముఖ్యం. బండి కండిషన్‌ ఎలా ఉన్నా కొంతదూరం డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాలంటే టైర్లు ఉండాల్సిందే. ముఖ్యంగా టైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.. ప్రమాదాలకు అధిక కారణం టైర్లు బాగలేకపోవడమే.. నిస్సాన్‌ మోటార్స్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మాగ్నైట్‌ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది.. దీనికి కస్టమర్స్ నుంచి విశేష స్పందన లభించింది..దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టైర్ బ్రాండ్లలో ఒకటి సియాట్ తో నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం నిస్సాన్ ఇండియాతో అనుబంధాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది..!

 

xceat securadrive tire

ఈ అనుబంధంలో భాగంగా, నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో సియాట్ సెక్యూరాడ్రైవ్ రేంజ్ టైర్లను ఉపయోగించనున్నారు. ప్రీమియం సెడాన్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీల కోసం తయారుచేస్తున్నారు. ఈ టైర్లు దృఢమైన బాహ్య బ్లాకులతో పాటు అసమానమైన థ్రెడ్ ప్యాటర్న్‌ను కలిగి ఉన్నాయి. రోడ్డుపై మంచి గ్రిప్‌ను ఇస్తాయి. వాహన నియంత్రణలో భద్రతను అందిస్తాయి. ఈ టైర్లలో అధునాతన సిలికా పాలిమర్ మెటీరియల్‌ను ఉపయోగించారు. ఇది తక్కువ రోలింగ్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ టైర్లు టైర్ శబ్దాన్ని తగ్గించడంలో ఆప్టిమైజ్ చేసిన ట్రెడ్ ప్యాటర్న్‌ను కలిగి ఉంటాయి. ఇందులో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి 16-ఇంచ్ స్టీల్ వీల్స్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ యొక్క అన్ని వేరియంట్‌లకు టైర్ ప్రొఫైల్ ఒకేలా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్‌లో 195/60 ఆర్16 టైర్లను ఉపయోగిస్తారు.

xceat securadrive tire

నిస్సాన్ ఇండియాతో అనుబంధం గురించి సియాట్ టైర్స్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ తోలాని మాట్లాడుతూ, రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ శరవేగంగా వృద్ధి చెందుతుంది. సియాట్ అందిస్తున్న సెక్యూరాడ్రైవ్స్ రేంజ్ టైర్లు అత్యుత్తమమైనవని అన్నారు. పనితీరు, వాహనం యొక్క సామర్థ్యానికి అనుగుణంగా టైలర్ మేడ్ టైర్ మోడల్‌ను అందించడానికి ఈ బ్రాండ్ అనేక ఆటోమోటివ్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, డ్యూయెల్ టెర్రైన్ టైర్లు కూడా ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!