టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

జోరు జోరుగా నిస్సాన్ మ్యాగ్నెట్ అమ్మకాలు.. ఒక్కరోజులోనే ఎన్ని డెలివరీలు ఇచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Share

నిస్సాన్ మ్యాగ్నెట్.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఇటీవల తన Nisson magnite compact SUV ని భారత మార్కెట్లో విడుదల చేసింది..! ఎస్ యువి విడుదల అయినప్పటి నుంచి విశేష ప్రజాదరణ పొందింది..! దీని వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.. రాజమండ్రి లోనీ కంటిపూడి నిస్సాన్ డీలర్ షిప్ మెగా డెలివరీ డ్రైవ్ ను నిర్వహించింది..! ఈ డ్రైవ్ లో ఒక్క రోజే 36 మంది కస్టమర్స్ కు నిస్సాన్ మ్యాగ్నెట్ ఎస్ యూవి లను డెలివరీ చేసింది..! ఈ మ్యాగ్నెట్ డెలివరీ లు, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి…!

Nissan magnet one day 36 deliveries.. cheapest car and updated features

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అధీకృత డీలర్ షిప్ అయినా కంటిపూడి నిస్సాన్ డీలర్ షిప్ ఒక్కరోజులోనే 36 మంది కస్టమర్లకు నిస్సాన్ మ్యాగ్నెట్ డెలివరీ చేసింది. ఇప్పటివరకు ఈ మోడల్ కోసం 33000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దీన్ని వెయిటింగ్ పీరియడ్ 6 నుంచి 8 నెలల వరకు ఉంది. ఈ నేపథ్యంలో నిస్సాన్ మ్యాగ్నెట్ కోసం వస్తున్న డిమాండ్లు తీర్చడానికి కంపెనీ తమ చెన్నై ప్లాంట్ లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని మూడవ షిఫ్ట్ ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా వెయిటింగ్ రెండు నుంచి మూడు నెలలకు తగ్గించాలని భావిస్తోంది. మార్కెట్లో లో దీనికి ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.49 లక్షలు గా ఉంది.

 

Nissan magnet one day 36 deliveries.. cheapest car and updated features

ఫీచర్లు:

Nissan magnite compact SUV 9 బాడీ కలర్స్, 5 mono tone , 4dual tone ఆప్షన్లతో లభిస్తుంది. అంతేకాకుండా స్లిక్ హెడ్ ల్యాంప్స్, L shaped డే టైం రన్నింగ్ లైట్లు DRL, డామినేటింగ్ ఫ్రంట్ గ్రిల్ తో అదరగొడుతుంది. ఈ ఎస్యువి లో 7- ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, వెల్కమ్ యానిమేషన్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టం , 8- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, +టచ్ స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్ ఇన్ వాయిస్ రికాగ్నేషన్, వంటి ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, నిస్సాన్ కనెక్ట్ ద్వారా 50 రకాల ఫీచర్లను కనెక్ట్ చేసుకోవచ్చు ఇందులో జియో ఫెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, స్మార్ట్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ అవసరానికి తగినట్లుగా వీటిని మార్చుకోవచ్చు. దీనికి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది..

ఇది కూడా చదవండి : నేటికి పాతికేళ్ళయినా… ఆ పాటలు వింటే “పెళ్లి సందడే”..!!

 


Share

Related posts

KCR : కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందించిన చిరంజీవి..!!

sekhar

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

Siva Prasad

ఒడిశాలో మహిళలకు పెద్దపీట

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar