Nithiin : కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.. యంగ్ హీరో నితిన్, రకుల్ ప్రీత్ , ప్రియా వారియర్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన చిత్రం చెక్.. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా లో నితిన్ ఖైదీ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తన అభిమానాన్ని మరోసారి చాటాడు నితిన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని యూత్ స్టార్ నితిన్ ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే.. నితిన్ నటించిన సినిమాలకు ప్రమోషన్ చేయడమే కాక నితిన్ హీరోగా చల్ మోహన్ రంగ అనే సినిమాని నిర్మించారు పవన్. మరోసారి తన ఫేవరేట్ హీరో పై అభిమానాన్ని నితిన్ దాచుకోలేక పోయాడు.. PK నా లక్కీ ఛామ్.. మీ అందరికీ తెలిసినట్టు నేను ఆయనకి పెద్ద అభిమానిని.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నాకు మంచి స్నేహితుడు. అతను భీష్మా ప్రమోషన్ కి హాజరయ్యాడు. ఆ చిత్రం పెద్ద హిట్ అయింది. అతను చెక్ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చాడు. ఇది కూడా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు నితిన్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!