ఏమ్మా నితిన్! ఆ సినిమా గురించి మాట్లాడవేం?

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. వరస ప్లాపుల తర్వాత నితిన్ నటించిన భీష్మ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా నితిన్ కెరీర్ కు చాలా ప్లస్ అయింది. అందుకే ఈ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు నితిన్. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టాడు.

 

nithiin is not talking about chandra sekhar yeletis check
nithiin is not talking about chandra sekhar yeletis check

 

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రంగ్ దే సెట్స్ పైన ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయ్యాక కరోనా కారణంగా లాక్ పడింది. అయితే రీసెంట్ గా కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ను మొదలుపెట్టారు. జాగ్రత్తల మధ్య షూటింగ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయిక కాగా వెంకీ అట్లూరి దర్శకుడు. రంగ్ దే ను సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. ఇక ఈ చిత్రం కాకుండా అంధధూన్ రీమేక్ ను కూడా చేస్తున్నాడు నితిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నభ నటేష్ హీరోయిన్ గా, తమన్నా కీలక పాత్రలో చేస్తోన్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందని టీమ్ చెబుతోంది. ఇకపోతే నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమా కూడా చేయాల్సి ఉంది. ఈ చిత్రం చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే ఈ సినిమాలు అన్నీ కాకుండా నితిన్ మరో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ కు ముందు మొదలైంది కూడా. అదే చెక్. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నితిన్. రకుల్ ప్రీత్ హీరోయిన్. జైలు నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఈ చిత్రం. లాక్ డౌన్ కు ముందు దాదాపు 20 శాతం షూటింగ్ పూర్తయింది కూడా. మరి ఈ సినిమా గురించి నితిన్ ఎందుకని ఏం మాట్లాడట్లేదు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.