Nithin : భీష్మ సినిమాతో యూత్ స్టార్ నితిన్ భారీ హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరోగా యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆ చిత్రమే ‘మాస్ట్రో’. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నభా నటేశ్, నితిన్ సరసన నటిస్తుంది. హిందీలో టబు నటించిన బోల్డ్ పాత్రలో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు ఆగిపోయింది. లేదంటే ఈ పాటికే ‘మాస్ట్రో’ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఉండేవారు.

అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమనుగుతున్నాయి. అందుకే టాలీవుడ్ మేకర్స్ సినిమాల షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే మాస్ట్రో కూడా ఫైనల్ షెడ్యూల్ షూట్ తాజాగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ప్రారంభించారు. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లోకూడా ఇంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా మాస్ట్రోనే కావడం విశేషం. కాగా ఈ లేటెస్ట్ షెడ్యూల్ నితిన్ – తమన్నాల మీద ప్లాన్ చేశారు. వీరిద్దరి మీద ముఖ్యమైన సీన్స్ ను పూర్తి చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ తో కంప్లీట్ పార్ట్ అయిపోతుంది.
Nithin : ‘మాస్ట్రో’లో అంధ యువకుడిగా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాను హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఆయుష్మాన్ ఖురానా ‘అంధాదున్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఇప్పటికే మాస్ట్రో సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి, గ్లిమ్స్ కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ట్రో నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతుండగా సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది భారీ స్థాయిలో మాస్ట్రో రిలీజ్ చేయనుండగా ఆయన ఇందులో అంధ యువకుడి పాత్రలో కనిపించనున్నారు.