Nithin : నితిన్ Nithin నటిస్తున్న సినిమాలని వరసగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను ఒకే ఒక్క నెల గ్యాప్ లో తీసుకు వస్తున్న యూత్ స్టార్ నితిన్ తాజాగా మరో సినిమా నుంచి అప్డేట్ ఇచ్చాడు. అసలు ఉందా లేదా అన్న క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఏకంగా రిలీజ్ డేట్ నే ప్రకటించి క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా అంధాదున్ సినిమాలో నితిన్ నటిస్తున్నట్టు ఎప్పుడో ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నితిన్ కి జంటగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు కూడా ప్రకటించారు.
ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ లేకపోవడం తో ఈ సినిమా ఈ ఏడాది వచ్చే అవకాశాలు లేవని అందరూ భావించారు. కాని తాజాగా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్ సినిమాని జూన్ 11 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నితిన్ కెరీర్ లో 30వ సినిమా కావడం విశేషం.
Nithin : నితిన్ నటిస్తున్న పవర్ పేట ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇక టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన ‘చెక్’ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న రిలీజ్ అవబొతోంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా నితిన్ నటిస్తున్న పవర్ పేట ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.