Nithya Menen: నిత్యా మీనన్ టాలెంట్ ఇప్పుడు బయటపడుతుంది..ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క

Share

Nithya Menen: టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన నిత్యా మీనన్ చాలా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. నిత్యా చాలా టాలెంటెడ్. ఆమె సింగర్‌గా కూడా సత్తా చాటుతుంది. రచన మీద కూడా అవగాహన ఉంది. అందుకే ఆమె కథల విషయంలో చాలా పక్కాగా ఉంటుంది. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏవి పడితే అవి ఒప్పుకోవడం లేదు. ముందు నుంచి నిత్యా ఇదే ఫాలో అవుతోంది. పెద్ద దర్శకుడు, పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం వచ్చినా కథ నచ్చకపోయినా అందులో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా నిర్మొహమాటంగా నో అనేస్తుంది.

nithya-menen-talent is highlighted now
nithya-menen-talent is highlighted now

ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా నిత్యా చేసింది చాలా తక్కువ సినిమాలు. కానీ ఆ సినిమాలతో తన క్రేజ్ అంతకంతా పెరిగిందే తప్ప తగ్గింది లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ అలాగే ప్రయోగాత్మకమైన సినిమాలను చేసేందుకు నిత్యా రెడీగా ఉంటుంది. అలా మొదలైంది తర్వాత ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతైందే, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అవే, గీత గోవిందం, ఎన్.టి.ఆర్ కథానాయకుడు లాంటి సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించి క్రేజీ హీరోయిన్‌గా మారింది నిత్యా మీనన్. తెలుగులో నిత్యా మీనన్ ఏ పాత్ర చేసినా దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

Nithya Menen: నిత్యామీనన్ మరో లేడీ యాక్ట్రెస్‌తో లిప్ లాక్ ఇచ్చి హాట్ టాపిక్‌గా మారింది.

ఈమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా అద్భుతమైన పాత్రలు చేస్తోంది. బాలీవుడ్‌లో మిషన్ మంగళ్ అనే సినిమాతో అడుగుపెట్టిన నిత్యా మీనన్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అయితే ఇందులో ఆమె పోషించిన పాత్ర వల్ల నెటిజన్స్‌తో కాంట్రవర్సీ కామెంట్స్ ఎదుర్కొంది. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తున్న నిత్యా మీనన్ ఎప్పుడూ హద్దులు మీరి నటించింది లేదు. ఎంచుకునే పాత్రలన్నీ చాలా క్లీన్‌గా ఉంటాయి.

అలాంటిది అభిషేక్ బచ్చన్‌తో చేసిన వెబ్ సిరీస్‌లో మాత్రం కథ డిమాండ్ చేయడంతో లెస్బియన్‌గా నటించి షాకిచ్చింది. ఇందులో నిత్యామీనన్ మరో లేడీ యాక్ట్రెస్‌తో లిప్ లాక్ ఇచ్చి హాట్ టాపిక్‌గా మారింది. చెప్పాలంటే ఇది అందరికీ షాకే. సినిమాలలో కనీసం నడుము చూపించేంత ఎక్స్‌ఫోజింగ్ కూడా చేయని నిత్యా, ఇలా ఏకంగా లిప్ లాక్ ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంది అని ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. అయితే దానికి ఆమె చాలా క్రియర్‌గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా ఈ మధ్య నిత్యా మీనన్ తెలుగు సినిమాలలో కనిపించడం లేదని అభిమానులు తెగ ఫీలయ్యారు.

Nithya Menen: ఆమె చాలా ప్రౌడ్ గా ఫీలయ్యే పాత్ర చేస్తుందని మాత్రం తెలుస్తోంది.

దానికి భారీ సర్‌ప్రైజ్ ఇస్తూ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం అందుకుంది. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తుంది. దాంతో టాలీవుడ్‌లో నిత్యా మీనన్‌కి ఇంతకాలం ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పుకుంటున్నారు. భీమ్లా నాయక్ లాంటి భారీ మల్టీస్టార్‌లో నిత్యా నటిస్తుందంటే డెఫినెట్‌గా ఆ పాత్ర చాలా పవర్‌ఫుల్ అయి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన రానా పరిచయ టీజర్‌లో నిత్యాను డైరెక్ట్‌గా చూపించకపోయినా ఆమె చాలా ప్రౌడ్ గా ఫీలయ్యే పాత్ర చేస్తుందని మాత్రం తెలుస్తోంది.


Share

Related posts

Superstitions: మూఢనమ్మకాల పేరిట మదనపల్లె హత్యను తలపించే విధంగా మరో కేసు!!

Naina

వాస్తు బాగోలేదని.. ఫ్రీ ఫ్లాట్ వదిలేశారు

Kamesh

Hydrabad Mayor Elections : హైద్రాబాద్ బాద్ షా ఎవరో? బీజేపీ రెడీ.. తెరాసతో ఢీ!

Comrade CHE