నివేదా పేతురాజ్ మంచి టాలెంటెడ్ హీరోయిన్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు నివేదా పేతురాజ్ చేసిన సినిమాలలో మంచి పేరే తెచ్చుకుంది. నివేదా పేతురాజ్ అందం.. అభినయంతో పాటు యూత్ ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరికి కరెక్ట్ జోడీ. అయినా నివేదా పేతురాజ్ కి సాలీడ్ అవకాశాలు దక్కడం లేదన్న మాట వినిపిస్తోంది. మరి తేడా ఎక్కడ జరుగుతోందన్నది మాత్రం అర్థం కావడం లేదు. టాలెంటెడ్ హీరోయిన్ అంటూనే సెకండ్ హీరోయున్ గా చూస్తున్నారు తప్ప స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఇవ్వడం లేదు.
ఇప్పుడు నివేదా పేతురాజ్ పరిస్థితి కూడా ఇలానే ఉందంటున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో అన్న సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది నివేదా పేతురాజ్. అయితే ఆ తర్వాత మళ్ళీ సోలో హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ దక్కలేదు. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. కానీ ఈ మూడు సినిమాలలో సెకండ్ లీడ్ లో నటించింది. అయితే నివేదా పేతురాజ్ కి మాత్రం సోలో హీరోయిన్ గా నటించి ఫేం తెచ్చుకోవాలని ఉంది.
ఇక ప్రస్తుతం రాం నటించిన రెడ్ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించింది. మాళవిక శర్మ మరో హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరిలో ఎవరు మేయిన్ లీడ్ అన్నది మాత్రం సినిమా రిలీజయ్యాకే అర్థం అవుతుంది. ట్రైలర్ చూస్తే మాత్రం రెడ్ సినిమాలో సాలీడ్ రోల్ దక్కిందనే అనిపిస్తోంది. ఇక ఈ సినిమా సక్సస్ మీద నివేదా పేతురాజ్ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయితే మరిన్ని అవకాశాలు దక్కుతాయని ధిమాగా ఉంది. మరి రెడ్ సినిమా రిజల్ట్ ఎలా ఉందో చూడాలి.