Nivetha thomas : నివేథా థామస్..టాలీవుడ్..కోలీవుడ్..మాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్గా వెలుగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్ ప్రారంభించిన నివేథా థామస్ తర్వాత చిన్న చిన్న పాత్రలు..చెల్లెలి పాత్రల్లో నటించింది. నటన పరంగా మంచి ప్రశంసలు దక్కుతుండటంతో హీరోయిన్గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో జెంటిల్ మాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని సరసన మొదటి సినిమా..ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కావడం నివేథాకి బాగా కలిసి వచ్చింది.
డెబ్యూ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోలేదు. తనకి సూటయ్యే పాత్రలనే ఎన్నుకుంటూ హిట్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో నివేథా థామస్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్గా కనిపించడం తగ్గింది. నాని – సుధీర్ బాబులు నటించిన వి సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు. కానీ పవర్ స్టార్ సినిమాలో మాత్రం అవకాశం అందుకుంది.
Nivetha thomas : నివేథా థామస్ ఇంకా కొన్నాళ్ళు సినిమాలలో హీరోయిన్గా నటిస్తానని క్లారిటీ ఇచ్చింది.
ఆయన రీ ఎంట్రీ ఇస్తూ నటించిన వకీల్ సాబ్‌లో కీలక పాత్ర పోషించి బాగా పాపులారిటీని సంపాదించుకుంది. వకీల్ సాబ్ తర్వాత నివేథా థామస్ గురించి ఇంకా ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం తను శాకిని – ఢాకిని సినిమా చేస్తోంది రెజీనా మరో హీరోయిన్. కాగా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమని అందుకోసమే కోర్స్ కూడా పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ముందు షార్ట్ ఫిలింస్ తీసి ఆ తర్వాత దర్శకత్వం చేస్తానని వెల్లడించింది. అయితే దీనికి కాస్త సమయం ఉందని తెలిపిన నివేథా థామస్ ఇంకా కొన్నాళ్ళు సినిమాలలో హీరోయిన్గా నటిస్తానని క్లారిటీ ఇచ్చింది.