ఎన్‌ఎంయూ సమ్మె నోటీసు

 

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్జూర్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి ఆరవ తేదీనుంచి ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేపట్టడానికి ఇప్పటికే తీర్మానించారు. ఎంప్లాయీస్ ‌యూనియన్‌తో సహా మరో తొమ్మిది యూనియన్లు సమ్మెకు మద్దతు ప్రకటించాయి.

శుక్రవారం సంస్ధ మేనేజింగ్ ‌డైరెక్టర్ సురేంద్రబాబుకు ఎన్‌ఎంయూ నేతలు సమ్మె నోటీసు అందజేశారు. తొలుత ప్రత్యేకంగా పోరాటం చేస్తామని చెప్పిన ఎన్‌ఎంయూ నిర్ణయం మార్చుకుని ఐక్య కార్యాచరణ సమితి బాటలో పయనించింది.

ఫిట్‌మెంట్ 50శాతం ఇవ్వాలని కోరుతూ ఈయూ గత ఏడాది డిసెంబరు 31న సమ్మె నోటీసును యాజమాన్యానికి అందజేసింది.

యాజమన్యంతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఫిబ్రవరి నుండి సమ్మె చేపట్టాలని ఐకాస తీర్మానించింది.