జైల్లో సహాయకుడు- నవాజ్ వినతికి పాక్ నో

జైల్లో సహాయకుడిని  ఇవ్వాలన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విజ్ణప్తిని పంజాబ్ ప్రావిన్స్ తిరస్కరించింది. జైల్లో తన పనులను నవాజ్ షరీఫ్ తానే చేసుకోవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

జైలు నిబంధనల మేరకు సహాయకుడిని ఇచ్చేందుకు అవకాశం లేదని పేర్కొంది.అల్ అజీజియా స్టీల్ మిల్స్ కుంభకోణం కేసులో నవాజ్ దోషిగా నిర్ధారణ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల జైలు శిక్ష కు గురైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం      లాహోర్ లోని కోట్ లఖ్ పట్ జైలులో ఖైదీగా ఉన్నారు.