ప్రభాస్ 21 విషయంలో ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదట ..!

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రాధే శ్యాం, అలాగే దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న ప్రభాస్ 21 వ సినిమా. ముఖ్యంగా ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కావడంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదనుకుంటున్నారట దర్శక, నిర్మాతలు.

 

 

 

 

Deepika Padukone Watches Nag Ashwin's Mahanati, Fuels Speculation ...

అందుకే ఎంత బడ్జెట్ అయినా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నట్టు ముందు నుంచి చిత్ర యూనిట్ చెప్పుకొస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా దర్శకుడు నాగశ్విన్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ను హీరోయిన్ గా సెలెక్ట్ చెసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంగీత దర్శకున్ని ఫైనల్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయట.

ప్రభాస్ 21 వ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ లేదా “బాహుబలి” తో గ్రాండియర్ ఆల్బమ్, మెస్మరైజింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎం ఎం కీరవాణి గాని ఈ సినిమాకి సంగీత దర్శకునిగా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం సినిమాకి సంగీత దర్శకుడు ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం.


Share

Related posts

Keerthi Suresh : బిజీ బిజీగా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్..!!

sekhar

ప్రభుత్వ చీఫ్ విప్‌గా గండికోట

somaraju sharma

Jc Prabhakar reddy : వాలంటీర్ల వ్యవస్థ పై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

sekhar