NewsOrbit
న్యూస్

Tollywood: ఆరంభంలోనే ఆశాభంగం!బంగార్రాజు తప్ప బాక్సాఫీస్ వద్ద చీదేసిన జనవరి మూవీలు !టాలీవుడ్ లో నిరాశ నిట్టూర్పులు

Tollywood: జనవరి నెల టాలీవుడ్ కేమీ అచ్చి రాలేదు.సాధారణంగాఈ నెలలో వచ్చే సంక్రాంతి సీజన్ మీద తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ ఆశలు ఉంటాయి.కరోనా కారణమైతేనేమీ,థియేటర్లో టికెట్ల అమ్మకాలను ప్రభుత్వం ఆన్లైన్ చేయడం అయితేనేమి ఈసారి టాలీవుడ్ లో సంక్రాంతి సంబరాలు లేవు.ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్,బీమ్లానాయక్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల విడుదల సైతం వెనక్కు పోయింది.

No Hits in Tollywood during Sankranti Season except  Bangarraju
No Hits in Tollywood during Sankranti Season except Bangarraju

ఏదైతేనేం అని సాహసించి కొన్ని సినిమాలు విడుదలైనా చేదు ఫలితమే వచ్చింది.ఒక్క స్టార్ హీరో నాగార్జున బంగార్రాజు మాత్రమే సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది.అలాగని అది బ్లాక్ బస్టర్ ఏమీ కాదు.పోటీ సినిమాలు చిన్న హీరోలవి కావడంతో బంగార్రాజు లాభపడ్డాడు.

Tollywood: జనవరిలో రిలీజైన సినిమాలు!

జనవరి నెలలో మొత్తం పది తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.ఈ నెల తొలి వారంలో విడుద‌లైన ఆశ – ఎన్ కౌంట‌ర్‌, ఇందువ‌ద‌న‌, 1945, అతిథి దేవోభ‌వ‌ తదితర చిత్రాలన్నీ డిజాస్ట‌ర్లే. చివరకు కాస్తంత ఇమేజ్ కలిగిన దగ్గుబాటి రానా న‌టించిన 1945 అయితే క్లైమాక్స్‌కూడా లేకుండానే విడుద‌ల కాగా రెండో రోజుకే ధియేటర్ నుండి వెళ్లి పోయింది.

ఇక సంక్రాంతి బరిలో!

సోగ్గాడే చిన్నినాయనా వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా నాగార్జున నాగచైతన్యల కాంబినేషన్లో అదే దర్శకుడు కల్యాణ్ కృష్ణ రూపొందించిన బంగార్రాజు హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైంది.ఈ చిత్రానికి పోటీగా రౌడీ బాయ్స్, హీరో,సూపర్ మచ్చి చిత్రాలు విడుదలయ్యాయి.ఈ మూడు సినిమాల హీరోలకు కాస్తంత బ్యాక్గ్రౌండ్ లేకపోలేదు.

బ్యాగ్రౌండ్ ఉన్నా వెంటాడిన బ్యాడ్ లక్

రౌడీ బాయ్స్ హీరో దిల్ రాజు సమీప బంధువు కాగా, సూపర్ స్టార్ కృష్ణ,ప్రిన్స్ మహేష్ బాబుల కాంపౌండ్ నుండి వచ్చిన నటుడు” హీరో”లో కథానాయకుడి పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సూపర్ మచ్చీ లో హీరోగా నటించారు.అయితే ఈ మూడు సినిమాలు బొక్కబోర్లా పడ్డాయి.గల్లీ బాయ్స్ కాస్త బెటర్ అనిపించింది.బంగార్రాజు బాగానే కలెక్షన్లు రాబట్టుకుంది.అయితే బంగార్రాజుకు ఈరోజుకీ బ్రేక్ ఈవెన్ స్టేజ్ రాకపోవటం ఇక్కడ గమనార్హం.ఏదేమైనా జనవరి నెలలో హిట్ అనిపించుకున్న సినిమా మాత్రం బంగార్రాజే.ఈ నెలాఖ‌రున విడుద‌లైన `గుడ్ ల‌క్ స‌ఖి` కూడా ఫ్లాప్ అయి కీర్తి సురేష్ కెరీర్‌లో మ‌రో డిజాస్ట‌ర్ గా మిగిలింది.మరి ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే సినిమాల ఫ్యూచరేంటో వేచి చూడాలి.పైగా ఇప్పుడు కరోనా వల్ల యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న వేళ ఏ మూవీ కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk