ఎంత ట్రై చేసినా శ్రీదేవీ కూతురిని టాలీవుడ్ కి తీసుకు రాలేకపోతున్నారు ..?

Share

టాలీవుడ్ హీరోయిన్స్ బాలీవుడ్ లో నటించడం చాలా తక్కువ.. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం టాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్నారు. ఇదే కాకుండా ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మాత్రమే ఆడిపాడే బాలీవుడ్ హీరోయిన్స్.. ఈ మధ్యకాలంలో మాములు హీరోల పక్కన కూడా నటించేస్తున్నారు. అందుకు ఉదాహరణ బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశీ రౌటెలా. ఎందుకంటే అక్కడ వర్కౌట్ కాకపోతే ఇక్కడ అన్నట్టుగా ఉంది ఈ కాలం హీరోయిన్స్ పరిస్థితి.

Team behind celeb looks after social media posting: Urvashi Rautela on tweet plagiarism- The New Indian Express

ఇకపోతే ఒక హీరోయిన్‌ను మన టాలీవుడ్‌కు తీసుకు రావాలని ఎంతగా ప్రయత్నించినా అదిమాత్రం వీలు కావడం లేదంటున్నారు. ఇంతకు ఎవరా ఆ హీరోయిన్ అని ఆరా తీస్తే.. అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బాలీవుడ్లో చాలా బిజీగా ఉన్నా ఈ అందాల సుందరి కోసం టాలీవుడ్ మేకర్స్ ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ఎంతగానో ట్రై చేస్తున్నారు. అదీగాక బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా జాన్వీ తనలా దక్షిణాదిలో సినిమాలు చేయాలని శ్రీదేవి కోరికని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.

కానీ ఇప్పటికీ జాన్వీ దక్షిణాదిలో సినిమాలు చేసే తీరిక దొరకడం లేదు. ఇక తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి కి సీక్వెల్ చేస్తే ఆ మూవీ ద్వారా జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని మన టాలీవుడ్ నిర్మాతలు ఆశిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. పైగా జాన్వీ బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉండటం మూలంగా తెలుగు చిత్రాలకు సమయం కుదరడం లేదనే వార్త వినిపిస్తుంది. ఇక తెలుగు సినిమాల్లో విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో కలిసి నటించాలని వుందని చాలా సందర్భాల్లో జాన్వీ కపూర్ తన మనసులోని మాటని బయట పెట్టింది.

Mommy-Daughter Duo Sridevi-Jhanvi Kapoor In Mr India Sequel? | India.com

దర్శకుడు పూరిజగన్నాద్ కూడా ఈ ముద్దుగుమ్మ కోసం ప్రయత్నించాడు. విజయ్ దేవరకొండ తో పూరి చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా కోం జాన్వీ ని అనుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ డేట్స్ కుదరలేదని అనన్యన్ పాండే ని తీసుకున్నాడు పూరి. ఇలా మొత్తానికి జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే టాలీవుడ్ సినిమాలలో నటించడానికి సమయం కుదరడం లేదని తెలుస్తుంది. కాబట్టి అతిలోక సుందరి అందాల శ్రీదేవి కూతురు తెలుగు తెరపై తుళుక్కున మెరవాలని ఆశపడే అభిమానుల కోరిక వీలైనంత త్వరగా నెరవేరాలంటే జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెట్టాల్సిందే.


Share

Related posts

Tirupati By Poll; వైసీపీ మీడియాపై టీడీపీ మహిళా నేత అనితకు తీవ్ర కోపం వచ్చింది..! ఎందుకంటే..?

somaraju sharma

భార్యాభర్తల మధ్య బంధం ఎప్పుడు పరిమళిస్తూ ఉండాలంటే ఆ విషయంలో జాగ్రత్త తప్పదు!!

Kumar

Pushpa: సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించిన “పుష్ప”..!!

sekhar