ఒకపుడు భారత మార్కెట్లో ప్రజాదరణ పొందిన మినీ బైక్.. సరికొత్త మార్పులతో, రీ డిజైన్, రీనేమ్ తో అలరించనుంది.. ఈ మినీ బైక్ లకు అంతర్జాతీయ మార్కెట్లో విశేష స్పందన ఉంది.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ తన డాక్స్ మినీ బైక్ ను మరోసారి అంతర్జాతీయ మార్కెట్లో విడుదలకు సిద్ధమైంది.. త్వరలోనే ఈ మినీ బైక్ ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.. ఈ బైక్ ప్రత్యకతలు ఇలా..
ఈ మినీ బైక్ ల రూపకల్పన చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఒక వ్యక్తి మాత్రమే ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ లో ఓక సీట్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఓపెన్ ఇంజిన్ ఛాయస్ , వెనుక సస్పెన్షన్, వైడ్ స్కూటర్ టైర్లు ను కలిగి ఉంటుంది. వెనుక క్యారియర్, హై సైలెన్సర్, హై హ్యాండిల్ బార్, హెడ్ లైట్స్, టైయిల్ లైట్స్ కూడా ఉన్నాయి.
హోండా కొత్త కనెక్టింగ్ ఫీచర్స్ ను కనెక్టివిటీ టెక్నాలజీ ద్వారా “రోడ్ సింక్” బ్లూటూత్ ద్వారా బైక్ డ్రైవర్ మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేస్తోంది. దీని సహాయంతో మెసేజ్, నావిగేషన్, ఫోన్ కాల్స్ ,మ్యూజిక్ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా వాయిస్ సపోర్ట్ ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అయితే ఈ డాక్స్ మినీ బైక్ కు కూడా ఈ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ తో పరిచయం చేయనుంది.