అపర్ణ బాలమురళి.. ప్రస్తుతం తమిళం తో సహా తెలుగు మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ అవుతున్న పేరు. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సూరారై పోట్రు సినిమా తో విపరీతమైన క్రేజ్ ని సొంత చేసుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అన్న టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా రక రకాల వార్తలు వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకి ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అయింది. తమిళం తో పాటు తెలుగులో కూడా భారీ సక్సస్ ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి కూడా బాగా ఆదరణ దక్కింది.
ఇక ఈ సినిమా అటు తమిళం లో ఇటు తెలుగులో అద్భుతమైన సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సమంత, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ సహా పలువురు సినిమా స్టార్స్ కూడా దర్శకురాలిని పొగడ్తలతో ముంచేశారు. వెంకటేష్ తో గురు సినిమాతో పాపులారిటీ సాధించిన లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమాని సూర్య డేర్ చేసి ఓటీటీలో రిలీజ్ చేసి భారీ సక్సస్ ని అందుకొని అందరికీ ధైర్యాన్నిచ్చాడు.
అయితే ఈ సినిమా రిలీజయ్యాక సూర్య కి ఎంతటి పేరు వచ్చిందో సూర్య కి జంటగా నటించిన హీరోయిన్ అపర్ణ బాలమురళి కి అంత పేరు వచ్చింది. అన్నీ చిత్ర పరిశ్రమలోని వాళ్ళు అపర్ణ సహజమైన నటనకి ఫిదా అయ్యారు. చెప్పాలంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అపర్ణ .. సూర్య నే డామినేట్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ దర్శకురాలు సుధ కొంగరి కి కూడా చెందుతుంది. గతంలో కూడా తను డైరెక్ట్ చేసిన సినిమాలలో హీరోయిన్ పాత్ర కొన్ని సీన్స్ లో హీరోనే డామినేట్ చేసేలా ఉంటుంది. కాని ప్రేక్షకులు అదే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఆకాశం నీ హద్దురా సినిమాకి అలాంటి ప్రశంసలే అందుకుంటుంది అపర్ణ.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!