మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగ. చిరంజీవి నటించే సినిమా కి సంబంధించి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో అని ప్రతీ సారి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒకప్పుడైతే చిరంజీవి తన బర్త్ డే ని అభిమానుల సమక్షం లో జరుపుకునే వారు. కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారని తాజా సమాచారం.
ఈ ఆగస్టు 22వ తారీకున మెగాస్టార్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి టైటిల్ తో పాటు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయాలని మెగా తనయుడు రాం చరణ్, దర్శకుడు కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో కాజల్ అగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రెజీనా కసాండ్ర ఒక స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పులేసింది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం టాకీపార్ట్ అండ్ ఒక సాంగ్ కంప్లీట్ అయింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మరో సినిమా మళయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే సుజీత్ పక్కా స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో తమిళ నటుడు జీవా మాత్రమే కీలక పాత్ర లో నటించడానికి ఫైనల్ అయ్యాడట.
త్వరలో మిగతా నటీ నటుల వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తుంది. అంతేకాదు చిరు బర్త్ డే రోజున ఈ సినిమా కి సంబంధించి కూడా ఒక బిగ్ సర్ప్రైజ్ రాబోతుందని తెలుస్తుంది. మొత్తానికి అన్నయ్య బర్త్ డే కి ఇవ్వబోతున్న బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లతో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.