ఎప్పుడో మొదలైన పుష్ప మీద నమ్మకం లేదు ..అసలు మొదలే కాని సర్కారు వారి పాట మాత్రం పక్కా నా ..?

Share

2020 ప్రారంభంలోనే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో పోటీ పడ్డారు. సంక్రాంతి బరిలో ముందు నుంచి రెండు సినిమాలు రెడీ కావడంతో అటు మహేష్ ఫ్యాన్స్ లో ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో తీవ్రమైన ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ రెండు సినిమాలు రిలీజై భారీ సక్సస్ లను సాధించాయి. కాకపోతే సరిలేరు కంటే అల వైకుంఠపురములో వసూళ్ళ పరంగా భారీ స్థాయిలో సాధించాయి.

 

అయితే తాజాగా మళ్ళీ మహేష్ బాబు అల్లు అర్జున్ ల సినిమాల గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. అయిదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టుగానే భారీ కాన్వాయిస్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తాజా చిత్రం మొదలైంది. కేవలం పూజా కార్యక్రమాలనే నిర్వహించిన ఈ సినిమా నుండి టైటిల్ తో పాటు సూపర్ స్టార్ లుక్ ని రిలీజ్ చేశరు. సర్కారు వారి పాట అన్న టైటిల్ ని ఫిక్స్ చేసిన యూనిట్ మహేష్ లుక్ రిలీజ్ చేయగా పెద్ద సంచలనం అయింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి రాని విధంగా సర్కారు వారి పాట లుక్ కి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవక ముందే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పోటీకి సిద్దమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు 2021 సమ్మర్ లో ఒకటి లేదా రెండు వారాలా గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తుంది. మరి ఆ సమయానికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి. ఇదే గనక నిజమైతే మరోసారి మహేష్ అల్లు అర్జున్ ల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటిటంటే పుష్ప పాన్ ఇండియా సినిమా కాగా సర్కారు వారి పాట మాత్రం మన దగ్గరే రిలీజ్ అవుతుందట.


Share

Related posts

తంబీ జై … రాజకీయ సై ; కాక రేపుతున్న రాజకీయం

Special Bureau

శంకర్ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్

Siva Prasad

AP Govt: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..! ప్రైవేటు లే అవుట్ వ్యాపారులకు బిగ్ షాక్..!!

somaraju sharma