Difficulties: ఎవరికీ అపకారం చేయలేదు కానీ మాకు ఎందుకు ఈ కష్టాలు అని బాధపడుతున్నారా ?దానికి కారణం తెలుసుకోండి!!

Share

Difficulties: మూడు తరములనుండి
కొందర్ని చూస్తుంటే   ఆ వ్యక్తి చాలా మంచి వారు కానీ ఎందుకు ఈ కష్టాలు ( Difficulties ) అని అనిపిస్తుంటుంది.   తెలిసి నేను  ఎవరికీ అపకారం చెయ్య లేదు అయినా నా కెందుకు ఇంత  కష్టం  దేవుడా… అని అడుగుతుంటారు. ఇక్కడ   చెయ్యని పాపాలకు వాళ్ళు ఎందుకు శిక్షలు అనుభవిస్తున్నారు అనేది ఆలోచించాలి.   దానికి  కారణం మూడు తరములనుండి వారికి  వ్యాపిస్తున్న  పాప పుణ్యాలు  కారణం అని  చెప్పవచ్చు.

Difficulties: పాప పుణ్యాలు

మనిషి పుట్టుకతో  గత జన్మ లో చేసిన పాప పుణ్యాల తో పాటు..  ఈ జన్మలో తన తల్లిదండ్రులు ( Patents ) , తాత ముత్తాతల కు సంబందించిన పాపాలు  పుణ్యాలు కూడా  ఆ మనిషికి    వచ్చి చేరుతాయి అని  చెబుతోంది మన ధర్మ శాస్త్రం.ఆస్తి పాస్తులు..  ధన – ధాన్యాలు,  వస్తు – వాహనాలు    తర తరాలకు  అందడం కనిపిస్తుంది కానీ  పాప పుణ్యాలు మాత్రం కనబడకుండా అందుతాయి. కనిపించే ఆస్తి పాస్తులు తర తరాలనుండి ఎలా సంక్రమిస్తున్నాయో..  కనబడని పాప పుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతోంది ధర్మ శాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాప పుణ్యాలు మాకు వద్దు  అని అంటే కనుక ఆస్తి పోతుందేమో కానీ పాప పుణ్యాలు మాత్రం    పోవు .  ఎందుకంటే   శరీరం అనేది తల్లిదండ్రులు, తాత ముత్తాతల  నుండి పొందినప్పుడు వారి నుం డి వచ్చే పాప పుణ్యాలు  అంత తేలికగా పోవు.

ప్రతి రోజు   భగవంతున్ని

మరి  ఏమి చేయాలి?ఏమి చేస్తే అవి పోతాయి ?అని ఆలోచిస్తున్నారా? ఐతే మీరు ఈ  జన్మలో ప్రతి రోజు   భగవంతున్నిస్మరించండి. ప్రార్ధించండి  మీకు ఉన్నంతలో ఇతరులకు  సహాయపడండి.  పర్వ దినాలలో పుణ్య నదులలో స్నానాదులు  చేయడం తో పాటు.. తీర్ధ యాత్రలు  చేస్తుండాలి. ఒక వేళా మీకు తెలిసి పాపం జరిగి ఉంటే చేసిన పాపాలకుపశ్చాత్తాప పడాలి.  ప్రస్తుత తరం పాపాలు చేయకుండా చూసుకుంటూ  భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి.


Share

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ కి పుష్పరాజ్ మేకప్ వెయ్యడానికి ఇంత కష్టపడుతున్నారా!!

Naina

జగన్ వర్రీ : ఎన్ని చోట్ల టీడీపీ ని ఓడించినా .. అక్కడ మాత్రం అవ్వట్లేదు .. !!

sekhar

Dull duel: మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే ఇది మంచి మార్గం!!

siddhu