శర్వానంద్ గురించి ఎవరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు ..?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా హిట్ కోసం తపన పడుతున్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శర్వానంద్ గత చిత్రం జాను కుడా బాగా డిసప్పాయింట్ చేసింది. కాగా ప్రస్తుతం శర్వానంద్ “మహాసముద్రం”, “శ్రీకారం” అన్న రెండు సినిమాలు చేస్తున్నాడు. శ్రీకారం ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయింది. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన పెంచల్ దాస్ సాంగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శర్వానంద్ ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు.

Sreekaram - Bhalegundi Baalaa Lyric | Sharwanand | Kishor B | Mickey J.  Meyer - YouTube

ఇక ఆర్ ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించబోతున్న మహాసముద్రం లో నటిస్తున్నాడు. సిద్దార్థ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా తాజాగా ఈ యాంగ్ హీరో మరో సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తోంది.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ తో కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన “డ్రీం వారియర్ పిక్చర్స్” ఈ సినిమాని నిర్మించబోతుండటం విశేషం. రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి కార్తీ నటించిన “ఖైదీ” సినిమా వచ్చి భారీ కమర్షియల్ హిట్ ని సాధించింది. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ నుంచి శర్వానంద్ సినిమా రాబోతుండటం ఆసక్తికరం. కాగా ఈ సినిమాకి మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాలు అందించిన టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తుండగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు అక్కినేని అమల కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. మొత్తానికి శర్వానంద్ నుంచి త్వరలో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ ప్రాజెక్స్ట్ రాబోతున్నాయి.