Raviteja : రవితేజ నటించబోతున్న సినిమాని రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్ లో 68 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి నక్కిన త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతక ముందు నాని తో నేను లోకల్, యంగ్ హీరో రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మావ సినిమాలు తీసి మంచి హిట్స్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు రవితేజ తో నక్కిన త్రినాథ రావు కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకి గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయ్ సినిమా కథ ఇన్స్పిరేషన్ అని కూడా ఆ మధ్యన వార్తలు వచ్చాయి.
కథ ఇదే అని రవితేజ 68 సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టిజి విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తర్వాత రవితేజ 68 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జోరుగా సాగుతుతోందట. మేకర్స్ ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్స్ మరీ యంగ్ బ్యూటీస్ అని రవితేజ సరసన మరీ అంత యంగ్ బ్యూటీస్ తీసుకుంటే జనాలు చూడలేరని మాట్లాడుకుంటున్నారట.
Raviteja : రవితేజ 68 కి ఐశ్వర్యా మీనన్, శ్రీలీల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంతక ముందు నేల టికెట్ సినిమాలో కూడా యంగ్ బ్యూటీ మాళవిక శర్మ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అప్పుడు కూడా హీరోయిన్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు కూడా రవితేజ 68 కి ఐశ్వర్యా మీనన్, శ్రీలీల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు రవితేజ కి హీరోయిన్స్ ఏంటీ మరీ ఇంత చిన్న వాళ్ళని తీసుకుంటే ఎలా రవితేజ ఏజ్ కి సెట్ అవుతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు