ఏపీ న్యాయవాదులకు సుప్రీం లో చుక్కెదురు

51 views

ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో సరైన సంప్రదింపులు జరపలేదనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు తగిన గడువు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం   దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌  ఈ పిటిష్ పై మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల అనంతరం మాత్రమే విచారణ చేపడతామని చెప్పారు.   కాగా తెలంగాణ  ప్రభుత్వం కెవియెట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి ఈ రిట్‌ పిటిషన్‌ రేపు అందజేసే అవకాశం ఉంది.