NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మంత్రి రోజాకు నో టిక్కెట్‌… ప‌గ ప‌ట్టి మ‌రీ చేసిందెవ‌రు…?

వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే.. వైసీపీ మంత్రి ఆర్కే రోజాకు ఈసారి టిక్కెట్ లభించే అవకాశం లేదా.. వైసీపీలో ఆమె చుట్టూ ఆమెకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలవనున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2014 – 2019 ఎన్నికలలో నగరి నుంచి వైసీపీ తరఫున రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు ఎన్నికలలో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం పై విజయం సాధించారు. విచిత్రం ఏంటంటే రోజా ఈ రెండు ఎన్నికల్లోను అతి స్వల్ప మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు.

No ticket for Minister Roja...Who did it after taking a grudge...?
No ticket for Minister Roja…Who did it after taking a grudge…?

2014 ఎన్నికలలో గాలి ముద్దుకృష్ణమ‌పై కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా 2019 ఎన్నికలలో గాలి కుమారుడు భాను ప్రకాష్ నాయుడు పై రెండు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రక్షాళనలో భాగంగా జగన్ క్యాబినెట్లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అయితే 2024 ఎన్నికలకు ముందు నగరిలో ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ప్రతికూలత ఎదురవుతుంది. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రోజా తనకు సొంత పార్టీ నేతలే నగరిలో వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ రెండు సంవత్సరాలుగా చాలాసార్లు చెప్పుకొచ్చారు.

ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు సొంత పార్టీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా జగన్ ఆమెపై నమ్మకంతో మంత్రి పదవి కట్టబెట్టారు. రోజా మంత్రి పదవి చేపట్టాక నియోజకవర్గం లో ఆమె కుటుంబ పెత్తనం.. ఆమె భర్త పెత్తనం ఎక్కువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూకబ్జాలు, అవినీతి, దోపిడి.. ఇలా చాలా అక్రమాలు జరిగాయని సొంత పార్టీ నేతలే ఆవేదన చేస్తున్నారు. పైగా ఆమె గతంలో మాదిరిగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శ కూడా వినిపిస్తోంది. దీనికి తోడు జిల్లాకు చెందిన కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజాకి వ్యతిరేకంగా నగరిలో తన సొంత గ్రూపును బాగా పెంచి ప్రోత్సహిస్తున్నారు.

ఇక స్థానిక సంస్థలకు చెందిన వైసిపి ప్రజాప్రతినిధులు అందరూ రోజాకు వ్యతిరేకంగా ఒకటవుతున్నారు. ఆమెకు ఈ ఎన్నికల్లో సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని వైసిపి అధిష్టానానికే అల్టిమేట్ జారీ చేశారు. దీంతో రోజా టికెట్పై నీలి నీడలు క‌మ్ముకున్నాయి. సొంత నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని బహిరంగంగా చెప్పడంతో పాటు అటు పీకే టీంకు కూడా నివేదికలు పంపడంతో ఈసారి టికెట్ ఇచ్చిన లాభం లేదనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.

పైగా గత రెండు ఎన్నికలలో రోజాపై గాలి కుటుంబం ఓడిపోవడంతో నియోజకవర్గంలో భాను ప్రకాష్ పై సానుభూతి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రోజాకు సీటు ఇస్తే ఈసారి కచ్చితంగా ఓడిపోతుందని భావించి ఆమెను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడే మరో చర్చ కూడా నడుస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న తనకు సీటు ఇవ్వకపోతే రోజా పార్టీ విడినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరి అభిప్రాయం. మరి రోజా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N