నోయల్ – రాహుల్ సిప్లిగంజ్ మధ్య గొడవ..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుండి రాహుల్ సిప్లిగంజ్ మంచి ఆక్టివ్ గా ఉన్నాడు. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ తరఫున ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాడు. పైగా గత సీజన్ టైటిల్ విన్నర్ కావటంతో.. రాహుల్ చేస్తున్న ఇంటర్వ్యూలకు మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది. ఇదిలా ఉంటే నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నోయల్ కి ఫస్ట్ నుండి రాహుల్ సపోర్ట్ చేస్తూనే రావడం జరిగింది.

Rahul Sipligunj: Bigg Boss Rahul, నోయల్‌లను ఫ్లైట్‌లోంచి దించేశారట.. అసలేం జరిగింది? - suma f3: funny incident to singers rahul sipligunj noel sean and revanth | Samayam Teluguకానీ మధ్యలో నోయల్ అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చేస్తూ నోయల్ తన సపోర్ట్ అభిజిత్, హారికా కి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా మొన్నటివరకూ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ అయ్యే అవకాశం ఉందని తెలపగా తాజాగా యూటర్న్ తీసుకుని రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ కామెంట్లు చేశాడు. రాహుల్ ఏమన్నారంటే తన దృష్టిలో టాప్ టు లో అరియానా, సోహెల్ నూటికి నూరుశాతం అర్హులు అని చెప్పుకొచ్చాడు.

 

అంతే కాకుండా హౌస్ లో ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ అదేవిధంగా జెన్యూనిటీగా ఉండే వారికి సపోర్ట్ చేయాలని చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో పనికిమాలినోళ్లను బయటకు తోసేయండని చాలా ఘాటుగా అన్నాడు. దీంతో రాహుల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో.. చాలా మంది నెటిజన్లు నోయల్ తో రాహుల్ కి గొడవలు జరిగినట్లు భావిస్తున్నారు. ఇటీవల నోయల్ బర్త్ డే సందర్భంగా కూడా రాహుల్ విషెస్ తెలియజేయలేదని అదేవిధంగా… తన సోషల్ మీడియా అకౌంట్ లో రాహుల్.. నోయల్ ని ఆన్ ఫాలో కూడా చేసినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య ఏదో గొడవ అయిందని.. అందుకే బిగ్ బాస్ చివరి దశకు వచ్చే సరికి రాహుల్ ఈ విధమైన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.