నోయల్ సేన్.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవలే వెళ్లిపోయాడు. అయితే.. ఆయన బయట ఎలా ఉంటాడో.. హౌస్ లో అలా లేడని.. ఆయన సేఫ్ గేమ్ ఆడాడని సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నోయల్ చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్. ఏదైనా టక్కున అనేస్తాడు. కానీ.. హౌస్ లో ఆయన ప్రవర్తించిన తీరే అందరికీ అనుమానం కలిగించింది.

కావాలనే హౌస్ లో సేఫ్ గేమ్ ఆడాడని.. ముందు ఉన్నట్టుగా తర్వాత లేడని వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఆయన వెళ్లేటప్పుడు కూడా అవినాష్, అమ్మ రాజశేఖర్ కు బాగానే వార్నింగ్ లు గట్రా ఇచ్చి బయటికి వెళ్లాడు. హౌస్ లో ఉన్నప్పుడు ఈ ఫైర్ ఎక్కడికి పోయిందంటూ బిగ్ బాస్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నోయల్ వెళ్లిపోతూ.. నాకు నచ్చిన కంటెస్టెంట్లు.. అభిజిత్, లాస్య, హారిక.. ఈ ముగ్గురు టాప్ 5లో ఉండాలని చెప్పాడు. నేను ఉండేలా చేస్తా.. అంటూ శపథం చేశాడు.
తర్వాత బిగ్ బాస్ 4 బజ్ ఇంటర్వ్యూలో మాత్రం రాహుల్ సిప్లిగంజ్ తో హారిక గురించి ఎలా మాట్లాడాడో తెలుసా? హారిక గురించి చెప్పు అని రాహుల్ అడిగినప్పుడు.. ఆక్ ఈజ్ ఆక్.. పాక్ ఈజ్ పాక్.. ఆక్ పాక్ కరివేపాకు.. అంటూ చెప్పేశాడు. అదేంటి.. హారిక తనకు నచ్చిక కంటెస్టెంట్ కానీ.. తన గురించి అలా చెప్పాడు.. అని ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు.
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. పూర్తి వీడియో రిలీజ్ చేస్తే గానీ అసలు నోయల్.. హారిక గురించి ఏం చెప్పింది తెలియదు.