హెచ్ఎండీ గ్లోబల్ రెండు కొత్త నోకియా ఆండ్రాయిడ్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. నోకియా 5.3, నోకియా సి3 పేరిట ఆ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. నోకియా 5.3 ఫోన్లో 6.55 ఇంచుల డిస్ ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉన్నందున ఫోన్ వేగంగా పనిచేస్తుంది. 4, 6జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. 64 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఇచ్చారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
నోకియా 5.3 ఫోన్లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ఉంది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు 5, 2, 2 మెగాపిక్సల్ కెపాసిటీలు ఉన్న మరో 3 కెమెరాలు ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. రెండు 4జి సిమ్‌లు వేసుకుని వాడవచ్చు. యూఎస్బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.
నోకియా సి3 ఫోన్లో 5.99 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 2, 3 జీబీ ర్యామ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 16 లేదా 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 400 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. రెండు 4జి సిమ్‌లు, ఒక మైక్రోఎస్డీ కార్డ్ వేసుకోవచ్చు. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాలను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంటుంది. 3040 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది.
* నోకియా 5.3 ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,499. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫోన్ లభిస్తుంది.
* నోకియా సి3 ఫోన్ 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7499. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999. సెప్టెంబర్ 17 నుంచి లభిస్తుంది.