Food: వెజిటేరియన్ కు నాన్ వెజ్ పార్శిల్ ను పంపించినందుకు… ఇంత జరిమానా విధించారా!!

Food: వెజిటేరియన్ కు నాన్ వెజ్ పార్శిల్ ను పంపించినందుకు... ఇంత జరిమానా విధించారా!!
Share

Food: ఈ మధ్య మనం ఎక్కువగా ఆన్లైన్ ఫుడ్ food మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. అక్కడికి వెళ్లి తెచ్చుకునే అవసరం లేకుండా మనకి కావలిసిన ఆహారాన్ని వారే స్వయంగా తీసుకొచ్చి మన ఇంటికి  ఇస్తారు కాబట్టి అందరూ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ వైపు మగ్గు చూపుతున్నారు. ఇలానే బెంగళూరు కి చెందిన విష్ణు బైతనారాయణ నాగేంద్ర అనే యువకుడు ఫ్రెష్ మెనూ అనే ఫుడ్ స్టార్టప్ లో 2018 ఏప్రిల్ 23న క్వినోవా సలాడ్ అనే ఫుడ్ ని ఆర్డర్ చేసాడు.

Non-veg food parcel for vegetarian
Non-veg food parcel for vegetarian

నిజానికి ఇది శాకాహార వంటకం కానీ ఆ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ నాగేంద్రకు అందించింది మాత్రం చికెన్ వంటకం. తన మాత ఆచారాల ప్రకారం అతను మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో అతను సదరు రెస్టారెంట్ కి ఫోన్ చేసి ఇది చెప్పగా వారు  క్షమాపణలు చెప్తూ అతని డబ్బు తిరిగి చెల్లిస్తామని అన్నారు. అంతటితో నరేంద్ర ఆగ్రహం సర్దుమణగలేదు. అతడు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి ఫ్రెష్ మెనూ మీద కేసు వెయ్యగా వారు ఫ్రెష్ మెనూ కి లీగల్ నోటీసులు ఇచ్చారు.

ఇలా ఏకంగా 28 నెలలు గడవగా తాజాగా ఈ కేసుకి సంబంధించిన తుది తీర్పు వచ్చింది. ఫోరం ఆ యువకుడికి చికెన్ పార్సెల్ వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని అడగగా ఆ రెస్టారంట్ వారు తనకు క్షమాపణలు తెలుపుతూ పంపించిన మెయిల్ ను చూపించగా కోర్ట్ ఫ్రెష్ మెనూ కి పరిహారంగా రూ.5 వేలు అలాగే అతడి కోర్ట్ ఖర్చులకు గాను  మరో రూ.5 వేలు వీటితోపాటు ఆ ఆర్డర్ ఖరీదు రూ.210 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.


Share

Related posts

Visakha Steel Plant : వకీల్ సాబ్ అంటూ పవన్ కళ్యాణ్ పై సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ ఆశక్తికర వ్యాఖ్యలు

somaraju sharma

కావాలనే బాలయ్య ఫాన్స్ ని కెలికిన హైపర్ ఆది ? 

sekhar

రేవంత్ త్వరలో కాషాయ కండువా కప్పు కోబోతున్నాడు అంటున్నా టీఆర్ఎస్ మంత్రి..??

sekhar