నాన్ వెజ్ ఐస్ క్రీమ్.. ఎక్కడ దొరుకుతుందంటే?

మాంసం ప్రియులకు శుభవార్త.. వేడివేడిగా మాంసం లాగించేస్తూ కూల్ గా ఏదైనా తినే వారు చాలామందే ఉన్నారు. అయితే ఇదే మాంసంతో ఐస్ క్రీం వచ్చేస్తుందండోయ్.. మాంసం ప్రియులకోసమే ఈ ప్రత్యేక ఐస్ క్రీం..అయ్యబాబోయ్ మాంసాన్ని కూడా ఐస్ క్రీం చేస్తారా అని మీరు అనుమానించాల్సిన అవసరం లేనేలేదు. రష్యాకు చెందిన మిన్స్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీట్ అండ్ డయిరీ సృష్టించిన ఈ ఐస్ క్రీం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందేనండోయ్..

ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ రకాల ఫ్లేవర్లతో వంటలు ట్రెండింగ్ వుతున్న సంగతి తెలిసిందే.. అవి చూస్తే అమ్మో వీటితో కూడా వండుతారా అని భయపడుతుంటారు. అదే నండి గులాబీ రుచితో మ్యాగీ, గులాబ్ జామూన్ వడా పావ్, ఒరియో సమోసా, చాక్లెట్ దోశ, జామూన్ పిజ్జా వంటివి సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వీరి ప్రయోగాలతో తినే వారికే వికారం వచ్చేలా చేస్తున్నారు. తాజాగా ఈ మాంసం ఐస్ క్రీం కూడా మరి ఏ జాబితాలో చేరనుందో..

మాంసాన్ని వేడి వేడి తింటే ఆ రుచే వేరబ్బా.. కాని ఇలా ఐస్ క్రీం లా ఉండి చల్లగా తింటారా.. అది భోజన ప్రియులకు నచ్చుతుందా అంటే నచ్చుతుంది దాని టేస్ట్ సూపర్ అంటున్నారు దాన్ని కనిపెట్టిన పరిశోధకులు. గత సెప్టేంబర్ నెలలో జరిగిన ‘బెలాగో 2020 ఎగ్జిబీషన్’ లో తొలిసారిగా మీట్ ఐస్ క్రీం గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పడు వారు చెప్పినట్టుగానే మీట్ ఐస్ క్రీమును తయారు చేసి చూపించేశారు.

మరీ ముఖ్యంగా ఇందులో చక్కెర ఉండతంట. కేవలం మాంసం నమిలినప్పుడు కలిగించే టేస్ట్ మాత్రమే ఇందులో ఉంటుందట. ఈ టేస్ట్ కోసం నేరుగా మాంసాన్నే వాడారో.. లేక రసాయనాలతో రుచిని తెచ్చారా అనేది స్పష్టం చేయలేదు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. చూడాలి మరి ఈ మీట్ ఐస్ క్రీం భోజన ప్రియులను మొప్పిస్తుందా అనేది.