Non vegetarians: సాధారణంగా మన పెద్దలు ఆహరం విషయంలో ఒక మాట చెబుతూ ఉంటారు. మితంగా తింటేనే అది ఆహరం లేకుంటే అది విషం అని. అతి ఎప్పుడు మంచిది కాదని మన అందరికి తెలిసిన విషయమే. కానీ మనకి ఇష్టమైన ఆహరం విషయంలో మాత్రం ఈ సామెతను మరిచిపోతూ ఉంటాం. ఏదైనా ఎక్కువ మోతాదులో మనం తీసుకుంటే అది కచ్చితంగా శరీరానికి చేటే చేస్తుంది.
ఈ జాబితాలో ముందు వరుసలో మాంసాహారం ఉంటుంది. అవునండి… మాంసాహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది శరీరానికి చాలా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకునే వారితో పోలిస్తే మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారి శరీరంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా మనం గమనించవచ్చు. ఇటీవల పోషకాహార నిపుణులు చేసిన పరిశోధనలో మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునే వారికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
మాంసాహారం లో అధిక మోతాదులో మాంసకృతులు, విటమిన్ ఏ, విటమిన్ డి అలాగే ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ లు మన శరీరానికి మేలు చేస్తాయి కానీ అధిక మోతాదులో మాంసాన్ని తీసుకోవడం వలన ఏమాత్రం శరీర బరువు బాగా పెరిగిపోతుంది. ఇక శరీర బరువు పెరిగితే వచ్చే అనారోగ్య సమస్యల గురించి మనకి తెలిసిందే. గుండెజబ్బులు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అందుకు బరువుని అదుపులో ఉంచుకోవడం మాత్రమే ఏకైక మార్గం. కాబట్టి బరువు అదుపులో ఉండాలి అంటే వారానికి కేవలం మూడు సార్ల మాత్రమే మాంసాన్ని తీసుకోవాలి.
అంతేకాకుండా శాఖాహారులలో గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాన్ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకోలేదు. అందువల్ల గుండె జబ్బులతో పాటుగా జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మాంసాహార ప్రియులు మితంగానే మాంసాన్ని తీసుకోండి….