ఏలూరు లో సాధారణ పరిస్థితులు..!!

Share

సరిగ్గా వారం రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు నగరంలో ప్రజలు విరోచనాలు, వాంతులు తో పాటుగా ఫిట్స్ వచ్చి పడిపోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని  ప్రపంచాన్ని వణికించినట్లు చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 500కు పైగా కేసులు ఈ లక్షణాలతో రావడంతో చైనా లో బయటపడిన కరోనా కంటే డేంజర్ వ్యాధి ఏలూరులో నెలకొందని అందరూ భావించారు.

Andhra Pradesh Eluru disease news: Cause of 'mystery disease' in Andhra Pradesh's Eluru remains unknown | India News - Times of Indiaపరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అంత మాత్రమే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందడుగు వేస్తూ ఈ వ్యాధికి మూల కారణం ఏంటో తెలుసుకోవడానికి పేషంట్ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పెద్దపెద్ద ల్యాబ్ లకు పంపించడం జరిగింది.

 

అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా ఏలూరు నగరానికి వచ్చి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. అయితే చాలా వరకు ఈ వ్యాధికి గల మూల కారణం నీటి కాలుష్యం అని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా గత శనివారం కాకుండా అంతకు ముందు శనివారం వింత వ్యాధితో బయటపడిన బాధితులు.. సంఖ్య ఉన్న కొద్ది తగ్గుతూ ఉండటం తో సాధారణ పరిస్థితి చాలా వరకూ ఏలూరులో నెలకొన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా సకాలంలో ప్రభుత్వ వర్గాలు పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తీసుకు రావడంతో పాటు బాధితులకు అండగా నిలబడటం తో బాధిత ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ చేయించడంతో ఏలూరులో దాదాపు ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. మరోపక్క ఏపీ సీఎం జగన్ ఏలూరులో ఈ వింత వ్యాధికి గల మూల కారణం ఏమిటి అనేదానిపై రివ్యూ సమావేశాలు బుధవారం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాల లో టాక్.


Share

Related posts

యూట్యూబ్ లో “వకీల్ సాబ్” టీజర్ సరికొత్త రికార్డ్స్..!!

sekhar

Telangana Formation day celebrations: నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

somaraju sharma

Play Back : గతం గురించి ఆలోచించకు.. ఉత్కంఠగా “ప్లే బ్యాక్ ” ట్రైలర్..

bharani jella