NewsOrbit
న్యూస్

కరుడుగట్టిన నేతకి కూడా…. కరోనా అంటే భయమా …?

 

 

ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలు దేశాలు అతలాకుతలం అయ్యాయి. అయితే ఉత్తరకొరియా దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు కనిపించలేదు. దీనికి కారణం అక్కడ కరుడుగట్టిన నియంత ఉండడమే. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ రూటే సపరేటు.. ప్రపంచమంతా ఓ దారిలో పయనిస్తుంటే ఆయన మాత్రం మరో దారిలో వెళతారు. అయితే, అందర్నీ భయపెట్టే కిమ్.. కరోనా పేరు చెబితే చాలు వణికిపోతున్నారు. మహమ్మారి వెలుగులోకి రాగానే సరిహద్దుల్ని మూసివేసిన దేశాల్లో ఉత్తర కొరియా ముందు వరసులో ఉంది. దాదాపు అన్ని దేశాల నుంచి ప్రయాణాల్ని నిషేధించారు. కేసాంగ్ నగరంలోకి ఓ వ్యక్తి చైనా నుంచి వచ్చాడనే అనుమానంతో ఏకంగా ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. ఒక కేసు రావడంతో నియంత కిమ్ జాంగ్ ఉన్ వారిని హతమార్చారనే వార్తలు కూడా వచ్చాయి. వుహాన్‌లో వైరస్‌ వెలుగులోకి రాగానే కిమ్‌ సర్కార్‌ అప్రమత్తమైంది. మెరుగైన వైద్య సదుపాయాలున్న చైనాయే వైరస్‌ ధాటికి విలవిల్లాడుతుంటే కిమ్‌ వణికిపోయారు. తాజాగా ఉత్తరకొరియాతో ముడిపడిఉన్న కరోనావైరస్‌కు సంబంధించి ఒక అప్‌డేట్ వచ్చింది.

 

Kim Jong Un

ఉత్తరకొరియాకు మంచి మిత్రదేశంగా ఉన్న చైనా… కిమ్ జాంగ్ ఉన్‌కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో ఉత్తరకొరియాకు వ్యాక్సిన్‌ను ఇచ్చి ఆదుకునేందుకు చైనా ముందుడుగు వేసింది. చైనాలో తయారైన వ్యాక్సిన్‌ను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు అతని కుటుంబ సభ్యులకు చైనా ఇచ్చింది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అంశాలకు సంబంధించిన అమెరికా అనలిస్టు హారీ కజియానిస్ పేర్కొన్నారు.

అయితే, చైనాలో అభివృద్ధి చేస్తున్న వాటిలో ఏ టీకాను కిమ్‌ వినియోగించారో స్పష్టంగా చెప్పలేదు. చైనా అభివృద్ధి చేస్తున్న ఏ వ్యాక్సిన్‌కూ ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం చైనాకు చెందిన సైనోవ్యాక్, కెన్‌సినోబయో, సినోఫార్మా సహా కనీసం మూడు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఉన్నట్టు అమెరికా మెడికల్ సైంటిస్ పీటర్ జే హోట్జే అన్నారు.

ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికారులు చేస్తున్న ప్రకటనలపై అమెరికా నిఘా సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. చైనీయులతో నేరుగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశాలు దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు.

ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయోగ దశల్లో ఉన్న వివిధ టీకాల సమాచారాన్ని తస్కరించడానికి సైబర్‌ దాడులు చేసినట్టు ఇటీవల మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఏ సంస్ధలపై వీరు దాడులు చేశారనే విషయం మాత్రం వెల్లడించలేదు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రాజెనెకాపై సైబర్‌ దాడి జరిగినట్లు మాత్రం ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.తమ దేశంలోని దాదాపు 10 లక్షల మందికి ఇప్పటికే తమ టీకాను అందజేశామని సినోఫార్మా ప్రకటించింది. అయితే, చైనాలో కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!