KIM JOUN UN :నార్త్ కోరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను నాటి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చుతారని అందరికీ తెలిసిందే. విస్తీర్ణం పరంగా బుడ్డ దేశమే అయినా ఎప్పుడూ ఎదో ఒక పవర్ ఫుల్ మిస్సైల్స్‌ను టెస్టింగ్(testing) చేస్తూ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తుంది నార్త్ కోరియా.. కిమ్ చూసేందుకు పొట్టిగా అధిక బరువుతో కనిపించే ఇతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరూ ఊహించలేరు. ఇతని ఆలోచనలు నియంతలకు ఏమాత్రం తీసిపోవు. తను చెప్పింది చేయాలి, అతనికి వ్యతిరేకంగా ఏది చేసినా, చేస్తున్నట్టు తెలిసినా వారికి చావే శరణ్యం.
Kim: ప్రపంచాన్ని వణికించిన నియంత కిమ్ నేడు బిత్తరచూపులతో…
కిమ్ చాలా మారిపోయారు..
నార్త్ కొరియాలో( north Korea) ఉండే ప్రజలు, యువత అందరూ తన హెయిల్ స్టైల్‌ను ఫాలో అవ్వాలని రూల్ పెట్టారు. అక్కడి యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లొద్దు.. అక్కడే బతికాలి. ఎంత కష్టమైనా భరించాలి. ఎవరైనా బోర్డర్ దాటాలని ప్రయత్నిస్తే వారు కఠిన శిక్షలు ఎదుర్కోనక తప్పదు. అయితే, కొన్నిరోజులు కిమ్ (KIM) అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతని స్థానంలో కొత్త పర్సన్‌ను పెట్టి ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే అవన్నీఅవాస్తవం అని, కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. 20 కిలోల బరువు(WEIGHT) తగ్గినట్టు దక్షిణ కొరియా నిఘా సంస్థలు తేల్చాయి.
Kim Jong Un: ఏడాది నుంచి కిమ్ జోంగ్ ఉన్ భార్య… ఏమైనట్లు?
కిమ్ ఒక్కరే.. రెండో వ్యక్తి లేరు..
2019లో 140 కేజీలు ఉన్న కిమ్ జోంగ్ ఉన్( 37) తాజాగా 20 కిలోలు తగ్గారని సౌత్ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. అతను ఆరోగ్యంగానే ఉన్నారని, అతనిలా మరో వ్యక్తి నటిస్తున్నారని వచ్చిన ఆరోపణలను సౌత్ కొరియా అధికార పార్టీ ప్రతినిధి కిమ్ బైంగ్ కీ కొట్టిపారేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా క్లోజ్‌లో ఈ విషయాన్ని ధృవీకరించామన్నారు.
Kim Jong Un: ఏడాది నుంచి కిమ్ జోంగ్ ఉన్ భార్య… ఏమైనట్లు?
ట్రాకింగ్ మోడల్స్, హై రిజల్యూషన్ మీడియో ద్వారా అతని బరువు మెజర్ చేయగా.. మునిపటి కంటే 20కిలోలు తగ్గినట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు.