NewsOrbit
న్యూస్

కరోనా‍ వ్యాప్తినే కాదు …రెండు హత్యలను కూడా ఆపిన లాక్డౌన్ !వర్కవుట్ కాని మట్కాకింగ్ సోదరుడి మర్డర్ ప్లాన్!

తన అన్నను చంపిందన్న కోపంతో వదినను చంపడానికి ఓ వ్యక్తి ప్లాన్ వేశాడు. కథ అడ్డం తిరగడంతో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సురేష్ భగత్ మట్కా వ్యాపారం నిర్వహించేవాడు.

మట్కా కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు అక్కడ రోజుకు వందలకోట్లలో లావాదేవీలు జరిగేవి. దాంతో సురేష్ భగత్ దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు సంపాదించాడు. దాంతో సురేష్ భగత్‌ను అడ్డుతొలగించుకుంటే.. ఆ డబ్బంతా తమకే వస్తుందని భావించిన ఆయన భార్య, కొడుకు, మరదలు సురేష్‌ను చంపాలనుకున్నారు. అందుకోసం కిరాయి హంతకులను మాట్లాడుకొని.. 2008లో అలీబాగ్ రోడ్‌లో వెళ్తున్న సురేష్ కారును లారీతో ఆక్సిడెంట్ చేయించారు. ఈ ప్రమాదంలో సురేష్‌తో పాటు కారులో మరో ఆరుగురు కూడా చనిపోయారు.

కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆక్సిడెంట్ ఒక డ్రామా అని గుర్తించి.. సురేష్‌ను అతని భార్య జయ, కొడుకు హితేష్, జయ చెల్లెలు ఆషాలు పథకం ప్రకారమే హత్య చేశారని తేల్చారు. దాంతో పోలీసులు 2013లో వారందరినీ అరెస్టు చేశారు. అయితే 2014లో హితేష్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ తర్వాత కొంత కాలానికి జయ, ఆమె చెల్లెలు ఆశా బెయిల్ మీద బయటకొచ్చారు.తన అన్నను చంపిన వారిని ఎలాగైనా చంపాలని సురేష్ తమ్ముడు వినోద్ భగత్ అనుకున్నాడు. అందుకోసం యూకేకు చెందిన ఒక కిరాయి హంతకుడితో రూ. 60 లక్షలకు బేరం మాట్లాడుకున్నాడు. ఆ కిరాయి హంతకుడు.. యూపీకి చెందిన మరో ముగ్గురితో హత్యకు ప్లాన్ చేశాడు.

అందుకోసం జయ, ఆషాల వివరాలు సేకరించిన తర్వాత ఫిబ్రవరిలో హత్య చేయాలనుకున్నారు. కానీ.. కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ రావడంతో ఆ ప్లాన్ వాయిదాపడింది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు తొలగిపోవడంతో మరోసారి హత్యకు తెరలేపారు. అయితే ముంబై పోలీసులు.. యూపీ కిరాయి హంతకుడైన అన్వర్ దర్జీని ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకొని విచారించగా.. అతని జయ మరియు ఆషాల ఫోటోలు మరియు జయ ఇంటి వద్ద తీసిన వీడియోలు లభించాయి. వీటి గురించి పోలీసులు ఆరా తీయగా.. ఈ హత్య ప్లాన్ బయటపడింది. దాంతో పోలీసులు కీలక సూత్రధారి వినోద్ భగత్ మరియు అన్వర్‌తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేసి హత్యయత్నాన్ని అడ్డుకున్నారు. సురేష్ భగత్ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ హత్య కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju