వందేమాతరమే కాదు..జనగణమణా పాడతాం!

50 views

మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతి నెలా మొదటి తారీకున వందేమాతర గీతాలాపన సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టి వివాదానికి తెరతీసిన కాం ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు తాము కొత్త విధానాన్ని అవలంబించనున్నామని చెప్పారు.

మధ్యప్రదేశ్ లో  బీజేపీ అధికారంలో ఉన్న గత పదిహేనేళ్లుగా సచివాలయంలో ప్రతి నెలా మొదటి తారీకున ఉద్యోగులలో దేశ భక్తి పెంపొందించేందుకు వందేమాతర గీతాలాపన అనే సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చింది. ఇటీవలి ఎన్నికలలో బీజేపీ  అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కమల్ నాథ్ వందేమాతర గీతాలాపన అదేశాలను నిలిపివేసి వివాదానికి కారణమయ్యారు. దీంతో విపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు ఒక ప్రకటన చేశారు. సచివాలయంలో ప్రతి నెలా మొదటి తారీకున వందేమాతర గీతాలాపనతో పాటు జనగణ మన కూడా పాడతామని పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి తారీకుల ఉదయం 10.45 గంటలకు సౌర్య సమర్క నుంచి వల్లభ్ భవన్ వరకూ పోలీస్ బ్యాండ్ మార్చ్ ఉంటుందని, ఆ బ్యాండ్ లో దేశ భక్తిని ప్రేరేపించే గీతాల సంగీతం ఉంటుందని తెలిపారు. పోలీస్ బ్యాండ్ మార్చ్ సచివాలయానికి చేనరిన తరువాత జాతీయ గీతం వందేమాతరం తోపాటు జనగణమన కూడా పాడతారని పేర్కొన్నారు.