Income: మీ సంపాదనతో తృప్తి లభించడం లేదా?అయితే ఇలా చేసి చూడండి.. అంతులేని ఆనందం కలుగుతుంది!!

Share

Income:  అసలు అవసరాలకు సరిపడా సంపాదన
మనం అందరం జీవితాన్ని కొనసాగించడం కోసం ఎదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తూనే ఉంటాము. ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళ సంపాదన ఉంటుంది. ఒకొక్కరికి విపరీతమైన సంపాదన ఉంటే మరొకరికి అవసరాలు తీరేంత మాత్రమే ఉంటుంది. మరి కొందరికి అసలు అవసరాలకు సరిపడా సంపాదన రావడం అనేది కష్టం గా ఉంటుంది.  చాలా మంది ముందు అవసరాలు తీరాక మిగిలిన డబ్బు పొదుపు చేద్దాం అని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. ముందుగా ఒక పద్దతి ప్రకారం అన్ని డబ్బుని విభజించి అప్పుడు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి అని… మన సంపాదన ఖర్చు చేసే పద్దతి  గురించి శ్రీమద్భాగవతం,ఎనిమిదవ స్కంధం లో ఈ విధం గా  తెలియచేయబడింది.

Income:  జన్మకు సార్ధకం

ఏ  వ్యక్తి   సంపాదన తక్కువ ఎక్కువలతో సంబంధం లేకుండా సంపాదించిన దానిని అయిదు భాగాలుగా వేరుచేయాలి.
అలా వేరు చేసిన మొదటి భాగాన్ని ధార్మికమైన పనులకు కచ్చితం గా ఉపయోగించాలి.    గుప్తదానాలు చేయడం , ధర్మాలు చేయడం, యజ్ఞాలు యాగాదులు చేయడం ఈతి బాధల్లోఅలమటిస్తున్నవారికి,ఆర్తులకు సహాయం చేసేందుకు, ప్రేత సంస్కారాలు   చేయడం వంటి కార్యక్రమాలు ప్రచారం కోసం  చేయకుండా  ఎలాంటి ఫలితం ఆశించకుండా మనస్ఫూర్తిగా  చెయ్యాలి. అన్నీ భగవంతుడు నాకు ఇచ్చి.. నాచేత ఇప్పిస్తున్నాడు  అన్న భావం తో చేయాలి.   ఇలా చేసినాడు మనిషి జన్మకు సార్ధకం ఏర్పడుతుంది అని తెలియచేస్తున్నారు. ఇక రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు  ఇచ్చే   ప్రజలకు ఉపయోగపడే  శాశ్వత కార్యక్రమాల కోసం వాడాలి.అంటే  ఆలయాలకు , ధర్మశాలలకు , అనాథ సేవాశ్రమాలకు, పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే కార్యక్రమాలకు  విద్యా అందించడానికి , వైద్య కార్యక్రమాలు కోసం, నిత్యాన్నదాన పథకాల విరాళాలు , పండిత సమ్మానాలు  వంటివి చేయడం వలన ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు ఎంత చేతనయితే అంతే అయినా కచ్చితం గా ఇవండీ.

 మన ధర్మ శాస్త్రాలు

ఇక మూడవ భాగం  నుండి  తిరిగి  మళ్ళి  డబ్బు  సంపాదించడానికి పెట్టుబడిగా  పెట్టుకునేలా చూడాలి.  అంటే  ఉద్జ్యోగం చేసేవారు అయితే  పొదుపు పథకాల్లో కానీ , ఇళ్ళ స్థలాలు కొనడం వంటి వాటిపై వీటిపై పెట్టుబడి పెట్టుకోవాలి.
ఇక నాల్గవ భాగం విషయానికి వస్తే  తనకు కావలిసిన    సుఖాలు, అవసరాల కోసం  ఉపయోగించుకోవాలి.
మిగిలిన  ఐదవ భాగం తనను  నమ్ముకుని బ్రతికేవారి  సుఖాలు, అవసరాలు, అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి.
ఇదే మన ధర్మ శాస్త్రాలు మనకు  ఇచ్చిన ప్రణాళిక. ఇవన్నీ ఎక్కడ అవుతాయి అని కొట్టి పడేయకండి.. ప్రయత్నం చేసి చూడండి ఇన్నాళ్లు ఎంత సంపాదిస్తున్న పొందలేని సుఖాన్ని,తృప్తిని పొందుతారు. మా సంపాదన తక్కువ మేము ఏమి చేస్తాం అనిఅనుకోకుండా వచ్చిన దానిలో ఎంతోకొంత పక్కన పెట్టి అది కేవలం సహాయం చేయడానికి మాత్రమే వాడండి. ఇలా చేయడం వలన మీకు గొప్ప తృప్తి ఉంటుంది. మీరు సహాయం చేసే ఆ కొంత డబ్బే ఒక్కోసారి ఒక జీవితాన్ని నిలబెట్ట వచ్చు అని మరువకండి.


Share

Related posts

Viral video: ఈ ముసలాయన మామూలోడు కాదు..! నవ మన్మధుడే..! ఆయన ట్రాక్ రికార్డు ఆదుర్స్..!!

somaraju sharma

Srikanth addala : నారప్ప శ్రీకాంత్ అడ్డాలకి సక్సెస్ ఇవ్వనట్టేనా..?

GRK

మీడియా తనదే అని విర్రవీగాడు !అడ్డంగా దొరికాడు !!

Yandamuri