తెలంగాణా ‘పంచాయితీ’ మొదలు

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణాలో గ్రామ పంచాయితీ ఎన్నికల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత ఎన్నికల ప్రక్రియ ఈనెల ఏడున ప్రారంభించి 21వ తేదీతో ముగిస్తారు. రెండవ విడత పోలింగ్‌ ఈ నెల 11న ప్రారంభమై 25తేదీతో, మూడవ విడత ఈనెల 16న ప్రారంభమై 30వ తేదీతో ముగుస్తుందని కమిషనర్ తెలిపారు.
తెలంగాణాలో మొత్తం 12,732 గ్రామ పంచాయితీల్లో లక్షా 13వేల 170 వార్డుల్లో ఓటర్లు ప్రజాప్రతినిధులను ఎన్నికోవాలని కోరారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారని చెప్పారు. తొలిసారిగా గ్రామ పంచాయితీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.