మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీలో ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర విలన్ గా అద్భుతమైన నటన నటించి, అందరి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. సినిమాలో వీరరాఘవ పాత్రలో నవీన్ చంద్ర నటించిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు బాలకృష్ణ మరియు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమాలో నవీన్ చంద్ర కి కీలక క్యారెక్టర్ బోయపాటి ఇచ్చినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో విలన్ పాత్ర లో శ్రీకాంత్ నటిస్తుండగా…ఓ కీలకమైన క్యారెక్టర్ కోసం నవీన్ చంద్ర ని బోయపాటి సెలెక్ట్ చేసినట్లు సమాచారం. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు కి ఈ సినిమాతో బోయపాటి హిట్ ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో బోయపాటి….’సింహా’ మరియు ‘లెజెండ్’ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టడంతో తీస్తున్న ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని బాగా కష్టపడుతున్నారు. దీంతో సినిమాకి సంబంధించి ప్రతి క్యారక్టర్ విషయంలో చొరవ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కి నవీన్ చంద్ర ని బోయపాటి ఎంపిక చేసినట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?