యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చిన్న తమ్ముడు నితిన్ నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. నితిన్ గత కొంత కాలం నుండి ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకుంటున్నాడు. నితిన్ మరోవైపు తనను తాను సినీ ఎంట్రీకి సిద్ధం చేసుకుంటున్నాడు.
నార్నే కుటుంబం నితిన్ ఎంట్రీ కోసం ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు, నిర్మాత ఫిక్స్ అయ్యారని, త్వరలోనే అధికారిక ప్రకటనతో మన ముందుకు రానున్నారని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక పెర్ఫెక్ట్ లాంచింగ్ తో నితిన్ నార్నే సినీ ఎంట్రీ ఉంటుందని, దీనికి ఎన్టీఆర్ సపోర్ట్ కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?