NTR: ప్రస్తుతం రాజమౌళి తో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలో సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కథను తారక్ ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడట.
ముందు ఎన్టీఆర్ కొరటాల శివ తో కూడా ఒక చిత్రంలో ఇలా స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు అని ఇండస్ట్రీ వర్గాలు నుండి న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఆ సినిమా పైన తదుపరి అప్డేట్ లేదు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక కబడ్డీ క్రీడాకారుడిగా కనిపించే అవకాశాలు ఉన్నాయట. కథ మొత్తం ఈ ఆట చుట్టూనే తిరుగుతుంది అని అంటున్నారు.
ఇప్పటివరకు తన కెరీర్ లో లో ఎన్టీఆర్ ఒక స్పోర్ట్స్ డ్రామా చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే RRR ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేసిన తర్వాత భారత దేశంలో ఇప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కేవలం ఒక సినిమా దర్శకుడి తో ఒక స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నారు.
అయితే ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సత్తా మనందరం చూసేశాం. పైగా ఎన్టీఆర్ తో సినిమాకు సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎంతైనా ఒక భారీ సినిమా తర్వాత వైవిధ్యమైన పాత్ర చేయాలంటే దానికి ఎంతో ధైర్యం కావాలి. అది కూడా పెద్దగా అనుభవం లేని దర్శకుడితో క్రీడా నేపథ్యంలో సాగే సినిమా చేయడం చాలా పెద్ద నిర్ణయం.
మరి బుచ్చిబాబు ఎన్టీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి..!