త్రివిక్రమ్ మూవీ విషయంలో జాగ్రత్త పడుతున్న ఎన్టీఆర్..??

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ని సరికొత్తగా చూపించడం లో త్రివిక్రమ్ సక్సెస్ సాధించాడు. కాగా సినిమాలో అంతా బాగానే ఉన్నా గానీ ఎంటర్టైన్మెంట్ చాలా వరకు తక్కువ ఉండటం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న “RRR” తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకూడదని ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నారట.

Trivikram Srinivas On A Tight Rope Walk To Ready Pan-India Script For Jr NTR Why Is Trivikram Restless About Jr NTR And RRR?ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్టోరీ పక్కాగా ఉండే రీతిలో త్రివిక్రమ్ కూర్చోవడంతో… ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేయాలని…స్క్రిప్ట్ ఆ రీతిగా ఉండేటట్లు చూడాలని త్రివిక్రమ్ కి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి తో చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పక్క హిట్ అవ్వాలని స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ పేర్కొన్నట్లు సమాచారం.

 

గతంలో రాజమౌళి తో చేసిన సింహాద్రి, యమదొంగ వంటి సినిమాల తర్వాత భయంకరమైన ఫ్లాప్ లు చూడటం జరిగింది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా తన కెరీర్లో 30 కావడంతో… పాటు రాజమౌళితో “RRR” తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి.. పక్కాగా హిట్టయ్యేలా ఉండాలని..గత సీన్ రిపీట్ అవ్వకూడదు అని త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం.