RRR : ఆర్ఆర్ఆర్‌లో ఎన్.టి.ఆర్, చరణ్ అన్నదమ్ములు..టాప్ సీక్రెట్ రివీల్

Share

RRR : ఆర్ఆర్ఆర్..టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ శక్తివంతమైన పోరాట యోధులుగా నటిస్తున్నారు. గోండ్రు బెబ్బులి కొమురం భీం గా ఎన్.టి.ఆర్, మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సంచలనాలు సృష్ఠిస్తోంది. ఇద్దరి హీరోల ప్రచార చిత్రాలతో పాటు ఆలియా భట్, అజయ్ దేవగన్ ల ఫస్ట్ లుక్స్ అలాగే కొమురం, అల్లూరి టీజర్స్ ఆర్ఆర్ఆర్ మీద ఊహించని విధంగా అంచనాలు పెంచేసింది.

ntr-charan-are-brothers-in-rrr-top-secret-revealed
ntr-charan-are-brothers-in-rrr-top-secret-revealed

ఇక బిజినెస్ పరంగా ఇప్పటికే లాభాలను తీసుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా దానికి రెట్టింపు బిజినెస్ అయినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న అన్నీ ప్రధాన భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు.

RRR : ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేశారు.

ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేశారు. తారక్, చరణ్ పాత్రలు అన్నదమ్ముల వలే ఉంటాయని హింట్ ఇచ్చాడు. ఒకదశలో ఇద్దరు మధ్య వచ్చే ఫైట్ చూసి ప్రతీ ఒక్కరు కళ్ళ వెంట నీరు కారుస్తారని తెలిపాడు. అంటే బద్ద శత్రువులుగా ఉన్న ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుందని చెప్పకనే చెప్పారు చిత్ర రచయిత. అంతేకాదు ఆలియా భట్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఓపెన్ గా చెప్పారు. దాంతో ఇప్పుడు అందరిలోనూ ఈ సినిమా మీద ఆతృత విపరీతంగా పెరిగిపోయింది.


Share

Related posts

నిర్మాణ రంగంలోకి

Siva Prasad

Atchan Naidu : సజ్జల రామకృష్ణారెడ్డి పై అచ్చెన్నాయుడు కీలక కామెంట్స్..!!

sekhar

విజయ్ దేవరకొండ కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్న సుకుమార్..!!

sekhar