NTR : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా హిట్ పడాలని త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో సింహాద్రి సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించలేక అనేక ఎత్తుపల్లాలు చూసిన ఎన్టీఆర్ చివరాకరికి..మళ్ళి రాజమౌళి చేతిలో పడి యమదొంగ తో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవడం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా తో కోలుకొని వరుస విజయాలు సాధిస్తున్నాడు.
NTR : “RRR” రాజమౌళి దర్శకత్వం
ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ “RRR” రాజమౌళి దర్శకత్వం సినిమా కాబట్టి నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా అయిన నేపథ్యంలో కచ్చితంగా స్క్రిప్టు మొత్తం అంత పర్ఫెక్ట్గా ఉండాలని పైగా ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా కాబట్టి కచ్చితంగా విజయం సాధించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా త్రివిక్రమ్ స్నేహితుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మలయాళం రీమేక్ సినిమా “అయ్యప్పనుమ్ కోషియం” పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తరుణంలో..ఎన్టీఆర్ అభిమానులు కొద్దిగా త్రివిక్రమ్ వ్యవహారశైలిపై మండిపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మెయిన్ సినిమా ఎన్టీఆర్ ది కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా పై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టడంపై..నందమూరి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. ఎన్టీఆర్ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికి కూడా షూటింగ్ మొదలు కాకపోవటంతో తారక్ ఫాన్స్ ఫుల్ సీరియస్ గా ఎన్టీఆర్ 30వ సినిమా యూనిట్ పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.