న్యూస్ సినిమా

జూనియర్ ఎన్టీఆర్ తన ఇమేజ్ కి సరిపోదు అని రిజెక్ట్ చేసిన సినిమా ఇదే!!

Share

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా సినీ రంగలోకి  “బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమా తో ప్రవేశం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం చిత్రంలో రాముడిగా నటించి ప్రేక్షకుల మన్ననను పొందాడు. ఆ తరువాత 2001వ సంవత్సరంలో “నిన్ను చూడాలని” చిత్రం ద్వారా సినీ రంగలోకి   హీరోగా ప్రవేశించాడు. తన నటన, అభినయంతో తాతకు తగ్గ మనవడిగా ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక అక్కడ నుంచి ఎన్టీఆర్ సినీ ప్రయాణం మనకు తెలిసిందే.

అయితే తన సినీ కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో పరాజయాలను అలాగే విజయాలను కూడా చవిచూశాడు. కొన్ని సందర్భాలలో అయితే  కథ నచినప్పటికీ తనకు వస్తున్న కొన్ని సినిమాలను అనుకోకుండా కొన్ని కారణాల చేత వదులుకోవాల్సి వచ్చిందట. బొమ్మరిల్లు సినిమా కూడా ఆ కోవకు చెందినదే. అవును …. బొమ్మరిల్లు సినిమా ముందుగా ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట. 2006 వ సంవత్సరం లో సిద్ధార్థ్, జెనీలియా జంటగా దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ బొమ్మరిల్లు. కానీ ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయవలసి వచ్చిందట.

దిల్ రాజు ద్వారా బొమ్మరిల్లు సినిమా కథను విన్న జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది. కానీ నా అభిమానులలో నాకు  ఉన్న ఇమేజ్ కు ఈ సినిమా నేను పోయినందుకు చాలా బాధపడ్డా. ప్రేక్షకులలో ఎన్టీఆర్ సినిమా అంటే ముందుగా  గుర్తొచ్చేవి డాన్స్, హీరోయిజం, కామెడీ, ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు. కానీ అవేవీ లేకుండా నేను సినిమా చేస్తే ఆ సినిమాకు నేను మోసం చేసిన వాడిని అవుతాను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.


Share

Related posts

Nazriya : నజ్రియా ఎంట్రీ ఇచ్చినట్టు సుందరం చెప్పనేలేదు..! 

GRK

గ్యాస్ లీకేజీ కేసు : జగన్ మళ్ళీ వైజాగ్ కి ?

arun kanna

బిజెపి-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య విపరీత ఘర్షణ…! కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar