NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి టాలెంటెడ్ నటుడు అనేది అందరికీ తెలుసు. టాలీవుడ్లోని అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ చిత్రాలు అతనికి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల ప్రొడ్యూసర్లకు మినిమమ్ గ్యారంటీ ఇస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ లో ఆరంగేట్రానికి సిద్ధమవుతున్నాడట.
భారత మూలాలున్న హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ తీయబోయే కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం తారక్ ను సంప్రదించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పూర్తి చేసే పనిలో తారక్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా ఉంది. దానికి ముందే త్రివిక్రమ్ తో ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే చిత్రం కూడా ప్లాన్ చేశాడు. వీటన్నిటి మధ్య హాలీవుడ్ చిత్రం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక సమాచారం బయటకు రావచ్చని అంటున్నారు.
హాలీవుడ్ లో మనోజ్ గొప్ప పేరే సంపాదించాడు. సిక్స్త్ సెన్స్, అన్ బ్రేకబుల్, సైన్స్, స్ప్లిట్ లాంటి చిత్రాలతో బాగా పేరు పొందిన మనోజ్ నుండి చివరిగా 2019లో గ్లాస్ అనే సినిమా వచ్చింది. ఇక అప్పటినుండి కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నట్లు ఆ సినిమాలోనే తారక్ కు ఒక పాత్ర ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే కొంత మంది ఇది కేవలం ఎన్టీఆర్ యాంటీ – ఫాన్స్ ఇస్తున్న తప్పుడు వార్తలు అని అంటున్నారు.
ఆ హీరో అభిమానులు రెచ్చిపోయిన తర్వాత అది అబద్దమని గాలి తీయడానికి ఇలాంటివి చేస్తుంటారని చెబుతున్నారు. అయితే ఈ వార్త పూర్తిగా నిజం అని అనుకోవడానికి లేకపోయినా మనోజ్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అన్న మాట వింటేనే ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తున్నాయి. మరి ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రవేశం గురించి అసలు నిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.