NTR – Janvi Kapoor: రూమరైనా నిజమవ్వాలని కోరుకుంటున్న ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్..!

Share

NTR – Janvi Kapoor:  సినిమా ఇండస్ట్రీలో 50 శాతం గాసిప్స్, రూమర్స్ వస్తుంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇలాంటి గాసిప్స్ గానీ, రూమర్స్ గానీ వచ్చేది హీరో – హీరోయిన్, హీరో – డైరెక్టర్, హీరోయిన్ – డైరెక్టర్స్‌కు సంబంధించే. ఓ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నట్టు ప్రకటన వచ్చిందంటే అందులో హీరోయిన్ ఈమేనట అని పుకార్లు పుట్టుకొచ్చేస్తుంటాయి. అలాగే ఓ హీరో – డైరెక్టర్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ అనౌన్స్ అవగానే కూడా హీరోయిన్ గురించే వార్తలు రాసేస్తుంటారు. అలాంటి క్రేజీ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ntr-janvi-kapoor-is pairing for koratala movie
ntr-janvi-kapoor-is pairing for koratala movie

ఇది గతంలో వచ్చిన గాసిప్పే..అయినా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ మొదలవబోతోందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గాను ప్రకటించారు. ఇందులో శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు మంచి క్రేజే ఉంది. చాలాకాలంగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమాలో అవకాశం దక్కించుకుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఏమోగానీ మొత్తానికే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

NTR – Janvi Kapoor: కొరటాల – ఎన్.టి.ఆర్ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌..?

ఇప్పుడు ఎన్.టి.ఆర్ 30కి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గాను ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న ఎన్.టి.ఆర్ రాగానే ఈ కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నాడు. మళ్ళీ ఇప్పుడు జాన్వీ పేరు ప్రచారంలోకి వచ్చింది. కొరటాల – ఎన్.టి.ఆర్ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకోకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆమె తండ్రి బోనీకపూర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాడట. ఇప్పటికైతే ఇది గాసిప్‌గానే ఉంది. అయితే ఇది నిజమవ్వాలని మాత్రం ఎన్.టి.ఆర్ అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Related posts

Mansas Trust: అశోక్ గజపతి రాజుపై విజయసాయి రెడ్డి ఎంతమాట అనేశాడు..!!     

somaraju sharma

స‌క్సెస్ కోసం ప్లాప్ డైరెక్ట‌ర్‌తో

Siva Prasad

Big Breaking: మే, జూన్ నెలల్లో ఉచిత రేషన్

somaraju sharma