NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు రాజకీయ జీవితానికే ఎసరు పెట్టిన కేసీఆర్…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రం లోని పాఠ్యపుస్తకంలో నందమూరి తారకరామారావు సీనియర్ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా చేసిన కేసీఆర్ బహిరంగంగా కూడా ఈ మధ్యనే అన్న గారి పై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే ఎన్టీఆర్ వారసుల తరఫున నందమూరి రామకృష్ణ ఒక ప్రకటనలో కెసిఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. 

 

Chandrababu Naidu, KCR scuttling cash-for-vote: YSRC

తెలుగువారి ఆత్మగౌరవం నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చడం నిజంగా ప్రశంసనీయమని…. కేసీఆర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే… చంద్రబాబు మాత్రం అసలు దీనిపై స్పందించకపోవడం తో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నైజం తెలిసిన వారు ఎవరికైనా అతని దగ్గర నుండి ఇటువంటి సంస్కారాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. సాధారణంగా తనకు చేతకానిది ఎవరైనా అమలు చేసి దాని ద్వారా వారికి పేరు వస్తుందంటే చంద్రబాబు జీర్ణించుకోలేరు. 

ఇక చంద్రబాబు…. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం విషయమై స్పందించక పోవడానికి కారణాలు ఏమై ఉంటాయని తెలియక కొంత మంది తలలు పట్టుకుంటున్నారు. ఎంతకాదన్నా టిడిపి పార్టీలో సగం కేడర్ ఇప్పటికీ ఎన్టీఆర్ చరిష్మా మీద నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. బాబు అతనిని వెన్నుపోటు పొడవలేదు అని నమ్మే జీవులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ ఇది కేసీఆర్ తరుపు నుండి మేలుకొలుపు అని టిడిపి వర్గాల్లో భయం మొదలైపోయింది. 

సరే చంద్రబాబు కేసీఆర్ ను ప్రశంసించకపోవడానికి…. అసలు విషయం పై ప్రస్తావించడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఏకంగా భార్య భువనేశ్వరి తో కలిసి ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించిన చంద్రబాబుకు కోట్లాది మంది ఆంధ్రుల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం పై స్పందించే కనీస తీరిక లేదాని సొంత పార్టీనే కెవులు కొరుక్కుంటుస్తున్నారట.

ఎన్టీఆర్ ను విస్మరించడం ఆయనకు కొత్తేమీ కాదు. వర్థంతులకి, జయంతులకి అతని విగ్రహాలకు పూలమాలలు వేసి నాలుగు గొప్పలు చెప్పి చేతులు దులుపుకోవడమే. దానికి మించి ఎన్టీఆర్ పట్ల ఇంకెక్కడా ఇంచ్ అంత కృతజ్ఞత కూడా చూపించలేకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్టీఆర్ విగ్రహాలపై ఎప్పుడు వేసే పూలమాలలు బాబు రాజకీయ జీవితానికి వేయాల్సి వస్తుందేమో.

author avatar
arun kanna

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk